టిఆర్ఎస్ పార్టీ నేతల ధర్నా మూలంగా ధర్నా చౌక్ ఇందిరాపార్క్ ప్రాంతం అపవిత్రమైందని, ఇందిరా పార్క్ దీక్షా ప్రాంగణానికి పట్టిన గులాబీ చీడపురుగులను సంహరించేందుకు క్రిమి సంహారక మందు చల్లి ధర్నాచౌక్ ను శుక్రవారం సాయంత్రం ఊడ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్, ఇతర కాంగ్రెస్, ఓయూ జెఏసి నిరుద్యోగ జెఏసి నేతలు శుభ్రం చేశారు.
అధికారంలో ఉండి బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు యాసంగి లో వరి పంట వేయవద్దని రైతుల్ని బెదిరించి ఇరు పార్టీలూ రైతులతో దొంగనాటకాలు ఆడుతున్నాయని రాయ్ ఆరోపించారు.
రైతు వ్యతిరేకతకి భయపడి కాంగ్రెస్ పార్టీ యాడ రైతులకి దగ్గరవుతుందోనన్న దిగులుతో రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రజా రైతు ఉద్యమాలను కబ్జా చేసి అధికారం లో ఉండి తమ పరువు తామే తీసుకున్నారని రాయ్ విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ నిషేదించిన ధర్నా చౌక్ లోనే ధర్నాలకి దిగి పూర్తిగా దిగజారిపోయిందని రాయ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సంయుక్త కార్యదర్శి బాస వేణుగోపాల్ యాదవ్, కె ప్రశాంత్ రెడ్డి,ఓయూ జెఏసి ఛైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి, నిరుద్యోగ జెఏసి నేతలు బిక్షునాయక్,అనీల్ కామ్డే తదితరులు పాల్హొన్నారు.