ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు సంవత్సరకాలం పాటు సరుకుల సరఫరా కోసం ఆలయ అధికారులు జారీచేసిన ఈ ప్రొక్యూర్మెంట్ , సీల్డ్ టెండర్ ప్రకటన జారీ వ్యాపారులలో అయోమయం, గందరగోళం కు దారి చేస్తున్నది. అధికారులు నిర్లక్ష్యంతో లేక నిద్రమత్తుతో టెండరు ప్రకటన జారీ చేశారో తెలియడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి.
20 అంశాలతో తొలి ప్రకటన:
దేవస్థానం వారు ఆర్ సి నెంబర్ 12/2021 , తేదీ 1-02-2021 నా ఈ టెండర్ , సీల్డ్ టెండర్ ద్వారా ప్రముఖ దినపత్రికలో జారీ చేసిన ప్రకటన ఫిబ్రవరి 3 న ప్రచురితమైంది. ఇందులో మొత్తం ఇరువది అంశాలు పేర్కొన్నారు. ఈ – ప్రో క్యూర్ మెంట్ ( ఆన్లైన్ ) లో ఐదు అంశాలు. సీల్డ్ టెండర్ ద్వారా 15 అంశాలు పేర్కొన్నారు. ఇందులో సీరియల్ నెంబర్ 12 అంశం ఎలక్ట్రికల్ సామగ్రి సప్లై గురించి , సీరియల్ నెంబర్ 17 అంశం శానిటేషన్ సామగ్రి సప్లై గురించి ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ సమర్పణ చివరితేదీ 16.02.2021 గా పేర్కొన్నారు.
రెండవ ఈ టెండర్ ప్రకటన జారీ !
స్థానిక దేవాలయం అధికారులు ఆర్ సి నెంబర్ 12/2021 , టెండర్ ఐ డి నెంబర్ 223337, తేదీ 11-02-2021 ద్వారా ఇ – ప్రొక్యూర్ మెంట్ టెండర్ ప్రకటన జారీ చేశారు తేది 1-04- 2021 నుంచి 31-03- 2022 వరకు ప్రొవిజన్ సప్లై గురించి వివరాలకై..https:// tender.telangan.gov.in నందు చూడగలరు అంటూ షెడ్యూల్ ప్రారంభం తేదీ 12-02-2021, ముగింపు తేది 22-02-2021. టెక్నికల్ బిడ్ ఓపెనింగ్, ప్రెస్ ఓపెనింగ్ ల తేదీలు కూడా ప్రచురించారు. ఈ టెండర్ లో దేవస్థానంకు కావలసిన సరుకుల లిస్టు సీరియల్ నెంబర్ ఒకటి నుంచి 108 సంఖ్య వరకు దేవస్థానం వారు పేర్కొన్నారు.
Also Read: గాలిలో మేడలు కట్టండి… శ్రమించి వాటికి పునాదులు నిర్మించండి
అయోమయం గందరగోళం ఇక్కడే:
ఫిబ్రవరి 1, 2021 న జారీచేసిన టెండర్ ప్రకటనలో ఐదు అంశాలు ఆన్లైన్ టెండర్ ద్వారా నమోదు చేసుకోవాలని అందులో పేర్కొనబడింది. సీల్డ్ టెండర్ ద్వారా 15 సరుకులు సప్లై హక్కులు పొందడానికి అవకాశం కల్పించారు. చివరి తేదీ 16-02-2021.గా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేవాలయ అధికారులు జారీచేసిన మరో ఈ-టెండర్ తేదీ 11-02- 2021 ప్రకటన లోని 108 సరుకుల వివరాల జాబితా లో సీరియల్ నెంబర్ 62 నుంచి 89 వరకు 29 రకాల ఎలక్ట్రికల్ వస్తువులు సప్లై కోరుతూ అందులో నమోదై ఉన్నాయి. సీరియల్ నెంబర్ 90 మంచి 108 వరకు 18 రకాల పారిశుద్ధ్య పనులకు వినియోగించే పదార్థాలు పరికరాలు సప్లై కొరకు అందులో పేర్కొనబడింది.
Also Read: ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం
ఎవరి వ్యాపార హక్కులు రద్దు చేస్తారు?
సీల్డ్ టెండర్ ద్వారా కోరిన ఎలక్ట్రికల్ , పారిశుద్ధ్య సామాన్లు సప్లై కి కొందరు వ్యాపారస్తులు సీల్డ్ టెండర్ వేశారు. 16న ముగింపు తేదీ. ఎవరో ఒకరు తక్కువ కోట్ చేసినవారికి దేవస్థానం అధికారులు టెండర్ నిబంధనల మేరకు హక్కులను కల్పించాల్సి ఉంటుంది.. తేదీ 11-02-2021 జారీచేసిన ఈ-టెండర్ ప్రోకుర్ మెంట్ ప్రకటనలో చివరి ముగింపు తేదీ 22-02-2021 గా ప్రకటించారు. ఈ ఆన్లైన్ టెండర్లు లోను. ఎలక్ట్రికల్ వస్తువులు, శానిటేషన్ సరకులు వస్తువులు సప్లై హక్కుల గురించి పేర్కొనబడింది. సీల్డ్ టెండర్ లో ఎలక్ట్రికల్ శానిటేషన్ సప్లై హక్కులు పొందిన వ్యాపారస్తులకు ఆన్లైన్ టెండర్లు 108 సరుకుల సప్లై హక్కులు పొందిన వ్యాపారికీ టెండర్ లో పేర్కొనబడిన ఎలక్ట్రికల్ , శానిటేషన్ సంబంధిత సరుకులను వస్తువులను విధిగా ఆయన ఆలయం కు సంవత్సరకాలం పాటు సప్లై చేయవలసి ఉంటుంది. అదే తరహాలో సీల్డ్ టెండర్ ద్వారా వాటిపై హక్కులు పొందిన వారు కూడా విధిగా ఆలయం కు సంవత్సరకాలం పాటు సప్లై చేయవలసి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆలయ అధికారులు సీల్డ్ టెండర్ లో పాల్గొన్న వ్యాపారి హక్కులను రద్దు చేస్తారా? ఆన్లైన్ టెండర్లు పాల్గొన్న వ్యాపారి హక్కులను రద్దు చేస్తారా ? తెలియడం లేదు.
టెండర్ల ప్రకటన జారీ లో అవినీతి, అక్రమాలు జరగకపోవచ్చు:
టెండర్ల జారీ ప్రకటనలు సాంకేతిక పొరపాటు వలన లేక అధికారుల నిర్లక్ష్యం లేదా నిద్రమత్తు వల్ల కావచ్చునేమో తెలియదు. తమ ఇష్టారాజ్యంగా టెండర్లు జారీ చేశారు అనే చర్చ భక్తజనంలో నెలకొంది. అయితే, ఇందులో అవినీతి, అక్రమాలు, డబ్బులు చేతులు మారడం ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు ఏప్రిల్ 1 నుంచి వారికి సప్లై హక్కుల బాధ్యత అప్పగించాల్సి ఉంది. టెండర్ ధరావతు డబ్బులు కానీ ఈ ఎం డి లు కానీ అంతా బ్యాంకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇకపోతే రహస్యంగా తమకు అనుకూలమైన వారికి హక్కులు కల్పించే అవకాశం లేదు. ఈ రెండు టెండర్లు బహిరంగంగా దినపత్రికల్లో ప్రచురితం చేశారు. దేవాలయ అధికారులు రెండవసారి ప్రచురించిన టెండర్ ప్రకటనలో ఎలక్ట్రికల్ ,శానిటేషన్ కు సంబంధించిన అంశాలను తొలగించి, లేదా టెండర్ ప్రక్రియనే రద్దుచేసి మరో టెండర్ ప్రకటన జారీ చేస్తే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని కొంతమంది వ్యాపారులు వివరిస్తున్నారు. ప్రచురితమైన రెండు టెండర్లలోనూ ఎలక్ట్రికల్ ,పారిశుద్ధ్య పనుల పరికరాల కోసం జారీచేసిన ప్రకటనలలో ఒకటి రద్దు చేస్తే సమస్య జటిలం కాకుండా ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. టెండర్ గందరగోళం, అయోమయం సమస్యకు ఆలయ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపిస్తారోనని భక్తజనం ఎదురుచూస్తున్నారు.
Also Read: నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు