కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం అసిఫాబాద్ కొమురం భీం జిల్లా కైరుగుడాలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్ధలో కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు అందజేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల 10 తేదీ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ కోసం కష్టపడుతున్న కార్మికుల సంక్షేమం కోసం లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 14, 15 తేదీలలో బెల్లంపెల్లి ఏరియాలోని అన్ని మైన్స్ లలో మేనేజర్లకు వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జి.ఎం ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని అశోక్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :సింగరేణి కార్మికులకు తొలి విడత కొవిడ్ వాక్సిన్ ఇవ్వాలి