భగవద్గీత – 21
‘Our doubts are traitors, and make us lose the good we oft might win, by fearing to attempt’ అని షేక్స్పియర్ మహాశయుడొక చోట చెపుతాడు!
ఈ పని అవుతుందా? అవ్వదా?
పరీక్షలో విజయం సాధిస్తానా? లేదా?
మనం చేసే ప్రయోగం విజయవంతం అవుతుందా? అవ్వదా?
ఇలా ప్రతి విషయంలో సందేహపడుతూ కూర్చున్నవాడు వాడున్న చోటినుంచి అంగుళం కూడా కదలలేడు! ఎందుకంటే వాడు పని మొదలుపెట్టకుండా ఫలితం గురించి ఆలోచిస్తున్నాడు! ఊహలలో బ్రతుకుతున్నాడు.
Also read: గురువు ప్రసన్నుడై అనుగ్రహించేది జ్ఞానం
నిజానికి వాస్తవం మనకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తుంది. మన ఊహ భయపెట్టి మనలను ముందుకు కదలనీయకుండా చేస్తుంది. ఊహించే మనస్సు ఎన్నో సంశయాల పుట్ట… వివేకముండదు, అజ్ఞానం ఆవరిస్తుంది.
అందుకే పార్ధసారధి కృష్ణుడు ఈ విధంగా చెపుతున్నాడు:
॥అజ్ఞశ్చాశ్రద్ధధానస్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః॥
అజ్ఞ అంటే వివేకహీనుడు,
అశ్రద్ధధానః అంటే శ్రద్ధారహితుడు,
సంశయాత్ముడు అంటె సంశయగ్రస్తుడు…
వినశ్యతి అంటే నశిస్తారు…
వాడికి ఇహలోకమూ ఉండదు, పరలోకమూ ఉండదు, సుఖమూ ఉండదు!
Also read: సర్వం బ్రహ్మమే
(వివేకహీనుడు, శ్రద్ధారహితుడు, సంశయాత్ముడు వీళ్ళు నశిస్తారు) అందుకే ఏదయినా పని మొదలు పెట్టినప్పుడు మీన, మేషం లెక్కపెట్టకుండా చేసుకుంటూ పోవటమే. చేస్తూ పోతూఉంటే విజయం అదే వరిస్తుంది.
విజయం అంటే ఒక పనిని వదిలిపెట్టకుండా నిరంతరం చేస్తూ ఉండటమే.
Just Do It…
LIVE THIS MOMENT!
రేపటి రోజు ఏమవుతుందో అని ఊహిస్తూ భయపడేకంటే, మన ముందున్న క్షణాన్ని అంటే వర్తమానాన్ని ఏ సంశయము లేకుండా ఫలవంతంగా గడిపితే చాలు.
It will take care of future!
Also read: ఎవరు పండితుడు?