- కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు
- మందిర నిర్మాణానికి ముస్లిం యువకుడి దాతృత్వం
స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు జువ్వాడి నరసింహారావు రామమందిర నిర్మాణం కు బుధవారం ఆయన తన స్వగ్రామం తిమ్మాపూర్ లో విశ్వహిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలకు అయోధ్యలో రామమందిర నిర్మాణం కు విరాళం అందించారు.
తనవంతుగా 21,116/- రూపాయలను అందించగా ఆయన మిత్రబృందం గ్రామస్తులు మరో 30 వేల రూపాయలను విరాళాలుగా అందించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి అందరివాడని అవతార పురుషుడు అని నేటి సమాజ మనుగడకు ఆయన రాజనీతి, కుటుంబ నేపథ్యం ఆచరణీయమని అన్నారు. నరసింహారావు తండ్రి స్వర్గీయ రత్నాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో మొదటి సంతకం ధూప దీప నైవేద్యాలు పథకాన్ని ప్రారంభిస్తూ సంతకం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరూ రాముని ఆరాధించేవారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:గ్రామాల్లో మార్మోగుతున్న రామ నామం !గందరగోళంలో నాయక గణం
మందిర నిర్మాణానికి ముస్లిం యువకుడి విరాళం:
రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా వేయి రూపాయలను ముస్లిం యువకుడు మహమ్మద్ షరీఫ్ ఇదే కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులకు అందించి అందరి మన్ననలు పొందాడు. ముస్లిం యువకుడు విరాళం అందిచడంతో కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ హిందూ ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సంగీ నరసయ్య , రంగు లక్ష్మీ నరహరి, బిజెపి నాయకులు పిల్లి శ్రీనివాస్, నలమాస వైకుంఠం, కందాల నరసింహమూర్తి. తదితర నాయకులు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు దినేష్ సింహరాజు ప్రసాద్ ,వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విరాళాలు వివాదాలు