మంచిర్యాల: గురువారంనాడు 2021 – 22 సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులలో మండల, జిల్లా ప్రజా పరిషత్తులకు రూ. 500 కోట్లు కేటాయించినందుకు మంచిర్యాల జెట్ పిపి పాలక మండలి ధన్యవాదాలు తెలిపింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖామాత్యులు హరీష్ రావుకు మంచిర్యాల జెడ్ పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, జడ్పిటిసి సభ్యులు కృతజ్ఞతలు తెలిపినారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించినందుకు గాను వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మేడి సునీత, ఎర్ర చంద్రశేఖర్, భుక్య తిరుమల, రుద్రబట్ల స్వర్ణలత, పల్లె చంద్రయ్య, వేల్పుల రవి, కో ఆప్షన్ సభ్యులు అజ్గర్ మొహియొద్దీన్ , షేక్ నహీం పాషాలు పాల్గొన్నారు.