* ప్రధాని మోదీకి లేఖ రాసిన వైఎస్ జగన్
* పింగళికి సేవలకు సరైన గౌరవం దక్కలేదన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జాతీయ పతకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్మృతిగా ఆయన కుటుంబాన్ని జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మితో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్ ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన ఫోటోలను తిలకించారు.
Also Read : వాలంటీర్లకు ఉగాది సత్కారాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో జగన్
జాతీయ పతాక రూపశిల్పిపింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖరాశారు. జాతీయ జెండాను రూపొందించి దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిల్చిన పింగళికి భారత అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబురాలకు గుర్తుగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పింగళికి భారతరత్న ప్రకటించడం సముచితంగా భావిస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. పింగళి వెంకయ్య సేవలను ఇప్పటికైనా గుర్తించాలని జగన్ కోరారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య స్వాంతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించారని దేశానికి ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎందరో ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read : సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ