- అన్నదాతలకు అండగా జగన్ సర్కార్
- పంట నష్ట పోయిన రైతుల ఖాతాల్లోకి 1252 కోట్లు జమ
- బీమా పరిథిలోకి 57 లక్షల మంది రైతులు
జగన్ సర్కార్ అన్నదాతలకు భరోసా కల్పించేందుకు మరో కొత్త పథకానికి జగన్ సర్కార్ ప్రారంభించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ప్రకృతి విపత్తులకు పంటలు నష్టపోయిన రైతుల ఖాతాల్లో 1252 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద 9.48 లక్షల రైతులు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, లబ్ధిదారులతో పొందుతున్న రైతులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇది చదవండి :వైఎస్సార్ జగనన్న “శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం”
గ్రామ సచివాలయాలతో రైతు భరోసా కేంద్రాల అనుసంధానం
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమల్లో భాగంగా రైతులపై పైసా భారం మోపకుండా వారి వాటాను కూడా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిథిలోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 10641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని వాటన్నింటిని గ్రామ సచివాలయాలతో అనుసంధానించామని సీఎం తెలిపారు. ఆర్బీకే పరిథిలోని ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా పంటనష్టం వివరాలు తెలుసుకుంటున్నామని సీఎం వెల్లడించారు.
ఇది చదవండి : “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం
పంటల బీమా పరిథిలోకి రైతులు
గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిథిలో ఉంటే ఇపుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారని సీఎం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినపుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ-క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ఇది చదవండి : ముమ్మరంగా పోలవరం పనులు-సీఎం జగన్