- నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు
- మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు
- ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఏకపక్ష విజయాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫుల్ జోష్ మీదున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల మన్ననలు పొందుతున్న సీఎం జగన్ ఇక పాలనలో తనదైన ముద్రవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
పాలన వికేంద్రీకరణకు పెద్ద పీట వేస్తున్న వైఎస్ జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంలుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా పరిపాలనా సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్ చైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఆంధ్రుల ఆంతర్యం ఏమిటి?
గవర్నర్ ఆమోదముద్ర :
అనుకున్నదే తడవుగా భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపారు. ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ ను పరిశీలించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ల ఎంపిక జరగనుంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, చైర్మన్‌ల విధానం అధికారికంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లోనూ ఇదే ఫార్ములా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అదే తరహాలో ఇద్దరు చొప్పున డిప్యుడీ మేయర్లు, ఛైర్మన్ ల పద్దతిని అమలు చేస్తున్నారు.
భారీగా ఆశలు పెట్టుకున్న విజేతలు:
వైసీపీ గెలిచిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులపై నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఆశావహుల జాబితా భారీగానే ఉండటంతో అందరినీ సంతృప్తి పరచాలని జగన్ భావిస్తున్నారు. ఇద్దరేసి చొప్పున డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను ఎంపికచేయడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. సీఎం తీసుకున్న సాహసోపేత నిర్ణయం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి – ఏపీ సీఎం