CLOTHES
——————-
(From “Prophet” by KAHLIL GIBRAN)
(అనుసృజన Dr. C. B. Chandra Mohan)
—————–
వస్త్రాలు,
నీ అంద విహీనాన్ని కప్పలేవు గానీ,
నీ సౌందర్యానికి ముసుగేస్తాయి!
అవి,
నీ గోప్యతను కాపాడతాయి గానీ
నీకు ముకు తాళ్ళు, సంకెళ్ళు
అవుతాయి!
అరుణ కిరణాల్ని,
పవన వింజామరల్ని
వస్త్ర రహితం గానే
బాగా ఆస్వాదిస్తావు!
ఎందు కంటే,
సూర్యుడు నీ శ్వాస,
వాయువు నీ రక్షకుడు!
కొంత మంది అంటారు కదా
“ఉత్తర ఋతు పవనాల
మంచు గాలులే
ఈ దుస్తుల నేతకు కారణమని!”
ఔను నిజమే!
ఈ నేత గాళ్లకు సిగ్గే– మగ్గం,
జంతు శకలం — దారం!
“ఏదో సాధించామన్నట్లు”
అడవిలో వికటాట్టహాసం చేస్తారు!
పాడు దృష్టి ఉన్నవారికే
“మర్యాద” ఒక కవచం.
ఆత్మశుధ్ధి కలవారికి
అది ఒక సంకెల,
ఒక మనో భారం!
‘నేల తల్లి నీ పాదాలు ముద్దాడాలని తపిస్తుంది!
పవనుడు నీ ముంగురులతో
సయ్యాట లాడాలని వాంఛిస్తాడు!‘
అని తెలుసుకో!
(https://www.poetryfoundation.org/poems/148574/on-clothes)
Also read: విపణి వీథి
Also read: వాంఛ
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి “తత్త్వాలు”
Also read: నా లోని నిజం