———– ————-
(‘ PEACE AND WAR’ FROM ‘THE WANDERER’ ,BY KAHLIL GIBRAN)
అనువాదం:డా.సి. బి. చంద్ర మోహన్
15. సంచారి తత్త్వాలు
————– —————-
మూడు శునకాలు ఎండలో మొరుగుతూ ఇట్లా మాట్లాడుకుంటున్నాయి.
మొదటి కుక్క పారవశ్యంగా ఇట్లా అంది ” ఈ శునక రాజ్యంలో జీవించడం చాలా ఆనందంగా ఉంది. మనం ఎంత సులభంగా నీళ్లలోనూ, భూమిపైనా , ఆకాశంలోనూ ప్రయాణించ గలుగుతున్నామో చూడండి ! శునకాల సుఖం కోసం కనుగొన్న సాధనాలు (చివరకు మన చెవులకు, కళ్ళకు, ముక్కులకు కూడా ) ఒక్కసారి తలుచుకోండి.”
రెండో శునకం ఇలా అంది ” మనం కళలలో చాలా శ్రధ్ద చూపిస్తున్నాము. మనం – మన తాత, ముత్తాతల కంటే చంద్రుణ్ణి చూసి చాలా శ్రావ్యంగా మొరుగుతాం. నీళ్లలో మన ప్రతిబింబాలు చూసుకుంటే , మన ముఖాలు పూర్వం కన్నా స్వచ్ఛంగా ఉంటాయి.”
మూడో కుక్క ” శునక రాజ్యాల మధ్య ఉన్న శాంతియుత అవగాహన నాకు ఆసక్తి కలిగిస్తుంది. నా దృష్టి అంతా దాని మీదే ఉంది !” అంది.
అదే సమయంలో కుక్కలు పట్టే మనిషి రావడం చూసాయి ఆ శునకాలు.
ఆ మూడు శునకాలు ఒక్క ఉరుకు ఉరికి రోడ్డున పడ్డాయి. పరుగు తీస్తూనే మూడో శునకం ఇట్లా అంది ” మీ ప్రాణాలు కాపాడు కోండి. నాగరికత మనల్ని తరుముకొస్తోంది. “
Also read: “నేతి”
Also read: వేదన
Also read: మూడు కానుకలు
Also read: సౌందర్యం
Also read: ప్రజలే ప్రభువులు