- నివాసం, కార్యాలయాలలో సీఐడీ సోదాలు
- ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పి నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి నారాయణపై సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు చింతారెడ్డి పాలెంలోని ఆయన నివాసంతో పాటు నారాయణ విద్యాసంస్థలు, కార్యాలయాలు, బుధవారం ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. రాజధాని భూ కుంభకోణంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ కుకట్ పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. సీఐబీ సైబర్ సెల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.
Also Read: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు