Tuesday, January 21, 2025

గోదా గోవింద గీతం – తిరుప్పావై 7

వ్రేపల్లె కుండల్లో చల్ల చిలకడమూ – క్షీరసాగర మథనమూ

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

మాడభూషి తెలుగు భావగీతిక

అదిగోవినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు

భారద్వాజ పక్షుల మధుర సంభాషణల నిక్వణాలు

కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున

నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు

ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద

 వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద

పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల

మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర

గోదమ్మ నమ్మాళ్వార్ ను మేలుకొలుపుతున్నారు. ‘‘అస్మత్సర్వ గురుభ్యోన్నమః’’  అనే ఆచార్య నమస్కార మంత్రాక్షరాలు వెలిగేపాట. సూర్యునికి ఉషస్సే కన్న తల్లి. ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, అదే నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.  మమ్మల్ని మంచి మార్గాన నడపమని ప్రార్థించే పద్యాలు ఇవి. ఇది మన వేద సంప్రదాయం.

Also read: గుఱ్ఱం నోట్లో చేతిని ఉబ్బించి కేశిని చంపిన కేశవుడు

గోపికా భావం

తాము పిలువబోయిన గోపబాలిక శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. రజస్తమోగుణాలసంకేతాలయిన రాత్రి గడచి, సత్వగుణప్రధానమైన లేత రవి కిరణాలు మెలమెల్లగా ఉదయించే సమయం. రజస్సు, తమస్సు అంత తొందరగా వదలవు, కాని తెలతెల్లవారుతుంటే క్రమంగా తగ్గుతాయి. చిన్నబీడు అంటే అప్పుడప్పుడే పెరుగుతున్న లేతగడ్డి. బాగా పెరిగిన బయళ్లకు బయలుదేరి గేదెలు కదిలిపోతూ ఉండడం అంటే రజోతమోగుణాలు తగ్గిపోతూ ఉండడమే అని కవయిత్రి భావం. పరమాత్ముడిని ప్రేమించేవారితో కలిసి వెళ్లడం లేదా వారిని వెంటతీసుకుని వెళ్లడం ఇక్కడ కీలకాంశం.  అందరం కలిసి చేద్దాం మంచిపనులు అనే గోద సందేశమే ఆ సమాజానికి నేటి సమాజానికి కూడా కావలసిందే. ఇది గోపికా పరమైన వ్యాఖ్యానం.

Also read: గోదా గోవింద గీతం తిరుప్పావై 6

బాపురేఖ, శ్రీధర్ వ్యాఖ్య: వ్రేపల్లెలో ఓ ఉదయం

బాపు తిరుప్పావై

గీతార్థాలను వివరించే అద్భుతమై కళాఖండాలను సృష్టించారు. భాగవతంలోని కథ దధిమధన శ్రీకృష్ణలీలను గోదాదేవి అంతర్లీనంగా అల్లితే దాన్ని మన కళాకారుడు బాపు అద్భుత చిత్రంగా ఆవిష్కరించినారు. వ్రేపల్లె గోపికలు నిత్య భక్తులు. పెరుగుచిలుకుతూ, అమ్ముతూకూడా శ్రీకృష్ణుని స్మరిస్తారు. మాట, చేత, మనసు ద్వారా చేసే వ్యాపారాలన్నీ కృష్ణుడికి అర్పిస్తున్నారు. మేం కృష్ణునికే చెందిన వారం, ఏం చేసినా ఆయన కోసమే అంటారు. నెత్తిన పాలు పెరుగు మోస్తూ పట్టణానికి వెళ్లి అక్కడ పాలు పెరుగూ అని అమ్మేందుకు గోవిందా దామోదరా మాధవా అని అరిచేదట.  ప్రభాత సమయాన యశోదఇంట చేతి కడియాల గలగలలతో తిరిగే కవ్వం, కన్నయ్య అల్లరి, సంతోషంగా పాలిచ్చేగోవు, నెత్తిన కుండలతో మాట్లాడే గోపికలు. ఈ మనోహర దృశ్యంలో, వ్రేపల్లెలో ఒక ఉదయాన్ని బాపు మన ముందుంచారు.

Also read: తిరుప్పావై5: చీకట్లు తొలగించు, కట్లు తెంచు శ్రీకృష్ణ ధ్యానము

మాడభూషి శ్రీధర్ 22.12.21

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

  1. If somebody like Julia Roberts or Natalie Portman had a personal blog where they posted pictures of their vacations or something, would you still take them seriously as actors? Do you think celebrities with personal blogs are less credible and taken less seriously than those who don’t? Furthermore, would you visit their blogs to see what they are up to?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles