నిజాయితీ లేకుండా సింగరేణి ఉద్యోగులు మరియు స్థానిక ప్రజల అవసరాన్ని మరియు అమాయకత్వమును ఆసరా చేసుకుని, నెలవారి చిట్టీలు మరియు అప్పుల పేరుతో ఇతర బాధితుల వద్ద నుండి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న వ్యక్తి పై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) అమలు చేశారు. నేరం చేస్తారనీ అనుమానం ఉన్నవారిని నేరం చేయకుండా నిరోధించేందకు ఈ చట్టం కింద పోలీసులు అదుపులోకి తసుకోవచ్చు.
ముత్యం సుధాకర్, తండ్రి : వంచాక్షరయ్య, వయస్సు: 50 సం.లు, కులము: పెరిక, వృత్తి: సింగరేణి ఉద్యోగి, నివాసము: ఇ.నెం.7-18/14, ఎఫ్ సిఐ కాలని, నస్పూర్ గేట్, సిసిసి నస్పూర్, మంచిర్యాల జిల్లా అనబడే- వైట్ కాలర్ నేరస్థుడు” పై రామగుండము పోలీస్ కమిషనర్ పీ.డీయాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ కుమారస్వామి , సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ లు పీ.డీ యాక్ట్ నిర్బంద ఉత్తర్వులను నిందితునికి ఆదిలాబాద్ జైలు లో అధికారుల సమక్షంలో అందజేసి అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించడమైనది.
నిందితుని నేర నేపథ్యం
నిందితుడు సింగరేణి కంపెనీలో ఉద్యోగం చేస్తూ, తాను రిజిస్టర్ అయిన నెలవారి చిట్టి నడుపుచున్నానని తన తోటి ఉద్యోగులని, స్థానిక ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో చిట్టీలు, అప్పుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి, హైదరాబాద్ మరియు ఇతర పట్టణాలలో ఇల్లు, మరియు స్థలాలు కొనుగోలు చేసి, అట్టి డబ్బులు తన స్వంతానికి వాడుకుని నమ్మక ద్రోహం చేసినాడు.
2020 సంవత్సరములో చిట్టీలు మరియు అప్పుల పేరుతో సింగరేణి ఉద్యోగులు, సాధారణ ప్రజల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయటం, మోసం మరియు నమ్మక దోహం వంటి (05) నేరాలు చేసినాడు. ఇటీవలి కాలంలో 2020 సంవత్సరములో రామగుండం కమీషనరేట్ పరిధిలో (03) నేరాలు చేసినాడు
నిజాయితీ లేకుండా సింగరేణి ఉద్యోగులు, స్థానిక ప్రజల అవసరాన్నీ, అమాయకత్వాన్నీ ఆసరా చేసుకుని, నెలవారీ చిట్టీలు, అప్పుల పేరుతో ఇతర బాధితుల నుంచి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న వ్యక్తి పై అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి, మాయమాటలు చెప్పి, ఆకర్షించి, మోసపూరితంగా వారిని నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు, రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో వరుసబెట్టి మోసం, బెదిరించడం వంటి నేరాలలో పాలుపంచుకుంటున్నాడు. తద్వారా ఉద్యోగులు, సాధారణ ప్రజల మనస్సులలో భయాందోళనలు సృష్టిస్తూ శాంతి భద్రత లకి విఘాతం కలిగించుచున్నది. ఇతని చర్యలు ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగించుచున్నాయి.
పీడీ యాక్ట్ అమలు చేయుటకు కృషి చేసిన ఏసీపీ జైపూర్ జి. నరేందర్ , మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ కుమారస్వామి , సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ లను సిపి అభినదించారు