- లక్షల మంది నివసించేందుకు వీలుగా భూగర్భ నిర్మాణాలు
- భారీ సొరంగాల్లో వినాశకర ఆయుధాలు
- ప్రపంచాన్ని శాసించే దిశగా వేగంగా చైనా అడుగులు
తన దేశాన్ని కాపాడుకోడానికి చైనా దశాబ్దాల క్రితం నుంచి ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటోంది. రష్యా, అమెరికా కన్నా ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉండాలని భావిస్తుంది. ఎన్నో అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంది. చైనా ఇప్పుడు అతి రహస్యంగా భూమి లోపల అన్ని హంగులతో అతి పెద్ద సిటీని నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. బీజింగ్ లో 2035 నాటికి పదివేల కిలోమీటర్ల భూగర్భంలో అతి పెద్ద సిటీని ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం ఐదు లేయర్ల తో భూమి లోపల 20 వేల ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్నది. బిజింగ్ నుంచి 105 కిలోమీటర్లు దూరంలో ఉంది. యుద్ధం వస్తే న్యూక్లియర్ బాంబులనుంచి కెమికల్ యుద్ధం నుంచి కాపాడుకునే విధంగా ఈ సిటీ నిర్మాణం ఉండబోతోంది. కమ్యూనిస్టు పార్టీ ముఖ్య కార్యాలయం, హై స్పీడ్ రైలు 20 నుంచి 30 నిమిషాల్లో బీజింగ్ కు చేరుకునే విధంగా ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. జలపాతాలు ఆటవీప్రాంతం కూడా ఈ సిటీలో ఉండనున్నాయి. మొత్తం 60 వేల కోట్ల డాలర్ల తో నిర్మిస్తున్న ఈ పట్టణంలో 60 లక్షల మంది నివాసం ఉండే అవకాశం ఉంటుంది.
Also Read : అమెరికా, చైనా నువ్వా-నేనా
ఆణు బాంబులనుంచి దాడులను తట్టుకునేవిధంగా భూగర్భంలో భవంతులను ఇతర కట్టడాలను నిర్మించనున్నారు. ఈ పట్టణంలోకి ప్రవేశించడానికి 900 వరకు గేట్ లు ఉంటాయి. మానవాళికి పెనుముప్పు కలిగించే అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ఇప్పటికే చైనా సొరంగాలలో దాచినట్లు తెలుస్తోంది. చైనా మావోసేతుంగ్ కాలం నుంచే సొరంగాలు తవ్వడం ప్రారంభించింది. సొరంగాలు తవ్వండి అందులో తిండి సౌకర్యం ఏర్పాటు చేయoడి..అంటూ మావో పిలుపు నిచ్చారు. ఆయన పిలుపుతో చైనాలో చాల సొరంగాలు ఏర్పడగా వాటిలో కొన్నింటినీ మూసివేయగా కొన్నింటిలో ఇప్పటికీ మనుషులు జీవిస్తున్నారు.
రష్యా చైనా పైన గతంలో చేసిన దాడి వల్ల భారీ ఎత్తున నష్టం జరిగింది. అప్పటి నుంచి రష్యా, అమెరికాలతో చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మూడు లక్షల మంది మానవ శక్తి తో పదివేల కు పైగా బంకర్లను ఏర్పాటు చేశారు. 1969 నుంచి 1985, 1995, 2009 ప్రాంతాలలో భూగర్భంలో సిటీలు ఏర్పాటు చేసినట్లు పలు సర్వే సంస్థల నివేదికలను బట్టి తెలుస్తోంది. 1970 లో బీజింగ్ జనాభా ఉండగలిగే అంత పెద్ద సొరంగాల సిటీని ఏర్పాటు చేసినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. హిమాలయాల కింది పొరల్లో సొరంగాలు ఏర్పాటు చేసి అందులో చైనా మిసైల్స్ దాచినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రపంచంలో నే అతి పెద్ద భూగర్భ పట్టణాన్ని 2035 లోపు చైనాలోని బీజింగ్ కు 100 కిలోమీటర్ల దూరంలో సిద్ధం చేసేందుకు వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పై రష్యా, అమెరికా లు ఎలా స్పoదిస్తాయో వేచి చూడాలి.
Also Read : నమ్మరాని పొరుగుదేశం చైనా