Saturday, December 21, 2024

“బాల్యం”

బాల్యం అపురూపం

చిన్నారి చిరునవ్వులు

తల్లిదండ్రుల వెలుగుదివ్వెలు

బుడిబుడి అడుగులు

కల్పిస్తాయి ప్రకంపనలు మదిలో

ముద్దు ముద్దు మాటలు

మురిపిస్తాయి మనందరినీ.

అమాయకపు చూపులు

భగవంతుని ప్రతిరూపాలు

ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో

ఊపిరి సలపని ప్రశ్నల పరంపర

అదే వికాశానికి మూలం

సమాధానాలు చెప్పే ఓపిక, శక్తి

కలిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే

వారికి వెలుగు చూపే మార్గదర్శకులు.

ఆటపాటలతో మైమరిచి

ఆనందంగా నర్తించాల్సిన బాల్యం

గాడిద బరువు మోస్తూ

హోంవర్కూ ట్యూషన్లనే చాకిరీతో

వేసారి వడిలిపోతూంది

టీవీలు, మొబైళ్ళూ, వీడియోగేమ్ లు

ఉన్నకొద్ది ఖాళీ సమయాన్ని ఆక్రమిస్తున్నాయి

ప్రశ్నలకు జవాబులు బట్టీ పట్టడం తప్ప

పుస్తకంలోని పాఠాలు చదివి అర్థం చేసుకోవడం లేదు

మార్కులు, సర్టిఫికేట్లు వస్తున్నాయి

ఆలోచనలు చేయగల శక్తి రావడం లేదు.

ఆలోచనను ప్రేరేపించేది విద్య.

ఆలోచనకు సమయమివ్వని విద్యావిధానం వ్యర్థం

విద్యలేనివాడు వింత పశువు అన్నారు

ఆలోచన చేయలేని విద్యార్థులు వింత జంతువులే

మరి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న

ప్రభుత్వాలను, టీచర్లను ఏమనాలో!

మరోవైపు బాల్య, యవ్వనాలనే తేడా లేకుండా

ఎవ్వరినైనా తమ రాక్షస కామానికి

క్రూరత్వానికి బలి చేస్తున్న వ్యవస్థలో ఉన్నాం

ఆ నరరూప పిశాచాలకు బలికాకుండా

పిల్లలను పెద్దలను కాపాడు ప్రయత్నం చేద్దాం

వికసించి పరిమళాలు వెదజల్లాల్సిన పూలను

నిప్పుల గుండంలో పడకుండా చూద్దాం

మనందరం కలిసికట్టుగానే కాక

విడిగా, స్వయంగా, స్వతహాగా చేయాల్సిన బాధ్యత

జాతి భవిష్యత్తును కాపాడే  మన పవిత్ర కర్తవ్యం.

Also read: ఓంకారం

Also read: ‘‘వరం’’

Also read: కనుమ(రుగు)

Also read: భోగిమంటలు

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles