ఈ జ్ఞానిన్ గనరే, దిగంబరుని,
బ్రాహ్మీబాల తేజంబుతో!
ఈ జ్ఞానిన్ గనరే, సమాధిగత
యోగీశున్ వలెన్ నిద్రలో!
ఈ జ్ఞానిన్ గనరే, మనోహరుని,
రాకేందుప్రభాజ్యోత్స్నలన్,
ప్రజ్ఞాశైశవ సాధుశబ్దముల సంభాషింప జ్ఞానాంబతో!
*
ఏ జ్ఞానాంబ సుధల్ గ్రహించి కనుదోయిన్ వ్రాల్చు నిశ్చింతతో,
ఆ జ్ఞానాంబ యురమ్మునే ఎగిసి పాదాబ్జంబుతో తన్నునే?
ఏ జ్ఞానాంబ ప్రియాంకమందొరిగి క్రీడించున్ తదేకంబుగా,
అజ్ఞానంబున గంగతో తడుపునే ఆ దేవి వస్త్రంబులన్?
*
ఆజ్ఞాపించు, స్వరంబు పెంచు నకటా, అల్లాడి క్షుద్బాధతో!
అజ్ఞాతంబుగ అంకసీమ అతడే ఆనంద
స్వప్నంబులన్!
నివర్తి మోహన్ కుమార్