- పెద్ద దిక్కు కోల్పోయిన వారికి అండగా వైఎస్సార్ బీమా
- నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్న సొమ్ము
- నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వైఎస్ఆర్ బీమా పథకం అమలులో భాగంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. అనుకోని విపత్తు సంభవించి ఇంటి యజమానిని కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారికి కూడా బీమా సొమ్మును చెల్లించడానికి సీఎం మానవతాదృక్పథంతో అంగీకరించారు. 2020 అక్టోబర్ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు 254 కోట్ల రూపాయల నిధులను సీఎం విడుదల చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లు
వైఎస్ఆర్ బీమా పథకం అమలు ఇలా!
పథకం అమలులో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు బీమా పరిహారం ఇస్తారు. అదే ప్రమాదవశాత్తూ మరణిస్తే 5లక్షల రూపాయలు, 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయలను పరిహారంగా అందిస్తారు.
Also Read: ఏపీలో అంగన్ వాడీ కేంద్రాలకు మహర్దశ