అప్పట్లో అతని మనసు ఊసులాడేది
ఆమె కళ్ళు సందేశాలు పంపేవి.
అతను చిన్నగా తల ఊపితే రమ్మని,
ఆమె చిలిపిగా చిరునవ్వు నవ్వితే రానని
అతను కనుబొమ్మలెగరేస్తే
‘ఎంత అందంగా ఉన్నవో !” అని
ఆమె కళ్ళు చికిలించి తే
చాల్లే పొమ్మని.
ఇది అప్పటి వారి భాష.
ఇప్పుడు వాళ్ళిద్దరి ముఖాలలో
భావాలు పలుకవు,
మనస్సుల లో గుసగుసలు చచ్చిపోయి
గుబుళ్ళు గూడుకట్టుకున్నాయి.
ఇది కాలం కరిగించిన
ప్రేమ కావ్యం కాదు.
ప్రేమ అనుకొని
భ్రమించిన కాలం నాటి
ఒకానొక ఉపాఖ్యానం.
Also read: సన్మానం
Also read: కత్తులు, కరవాలాలు
Also read: జీవన సంధ్య
Also read: ఆకాశ హర్మ్యం
Also read: బాస