Tuesday, December 3, 2024

హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ దాఖలు

  • న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చలు
  • రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారన్న చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో   విచారణ నిమిత్తం  హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీ చంద్రబాబుకు నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని నోటీసులో వివరించింది. 

Also Read: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు:

ఆరు రోజుల కిందట కేసు నమోదు చేసిన సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ మాత్రం మంగళవారం (మార్చి 16) వెలుగుచూసింది. ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌),(జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం సీఐడీ కేసులు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, టీడీపీ హాయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పి.నారాయణను ఏ2గా పేర్కొంది.

న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చలు:

సీఐడీ నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతోనూ న్యాయ నిపుణులతోనూ సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు సీఐడీ నమోదు చేసిన కేసులపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. క్వాష్ పిటీషన్ లో 41A కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని, పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు.

Also Read: టీడీపీ మాజీ మంత్రి నారాయణ నివాసంలో సీఐడీ సోదాలు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles