- కౌంటింగ్ ను గాలికొదిలేశారని ఆగ్రహం
- పార్టీ ఓటమిపై శ్రేణులతో సమీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాయని మచ్చగా మిగలనున్నాయి. సొంత నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు. వైసీపీ మైండ్ గేమ్ తోపాటు అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం వల్లే టీడీపీ ఓటమి పాలయిందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
శ్రేణులకు బాబు హితవచనాలు :
పార్టీ ఓటమిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పార్టీ క్యాడర్ కు ధైర్య వచనాలు నూరిపోశారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలతో చంద్రబాబులో అంతర్మథనం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబుకి కంచుకోటగా ఉన్న గ్రామాలన్నింటినీ వైసీపీ హస్తగతం చేసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఏమైపోయాయంటూ ప్రశ్నల వర్షం కురిపించి క్షేత్ర స్థాయిలో నేతల అలసత్వమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దని త్వరలో కుప్పం వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానంటూ పార్టీ శ్రేణులకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి అధికార పార్టీ చేసిన దౌర్జన్యం, విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీవల్లే ఓటమి పాలయినట్లు పార్టీ నేతలు చంద్రబాబుతో చెప్నినట్లు సమాచారం.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల