వోలేటి దివాకర్
రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం పనికిమాలిన కారణాలకు నడుస్తున్న రైలులో అలారం చైన్ లాగితే క్రిమినల్ చర్యగా భావిస్తారు.
సరైన కారణం లేకుండా చైన్ లాగితే ఒక సంవత్సరం జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
తరచుగా అలారం చైన్ పుల్లింగ్ కేసుల కారణంగా, రైళ్ల సమయపాలన తీవ్రంగా దెబ్బతింటోంది. ఇతర రైళ్లు కూడా ఆలస్యంగా నడపడానికి దారితీస్తోంది.
విజయవాడ డివిజన్ పరిధిలో యువత ఆకతాయితనంగా చైన్ లాగుతున్నట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డ్రైవ్ లో వెల్లడైంది.
విజయవాడ డివిజన్‌లో జనవరి-2024లో అలారం చైన్ పుల్లింగ్ ను నిరోధించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆకస్మిక తనిఖీలను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. ట్రాఫిక్ కార్యకలాపాలపై అలారం చైన్ పుల్లింగ్ యొక్క పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ డ్రైవ్ లక్ష్యం.
ఒక్క జనవరిలోనే మొత్తం 112 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1097 మందిని అరెస్టు చేసి రూ. 6.39 లక్షలు వసూలు చేశారు.
ఆకస్మిక తనిఖీలను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. ట్రాఫిక్ కార్యకలాపాలపై అలారం చైన్ పుల్లింగ్ యొక్క పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ డ్రైవ్ యొక్క లక్ష్యం.