Thursday, November 21, 2024

టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు

  • 100 అంతర్జాతీయ మ్యాచ్ ల చహాల్
  • బుమ్రాను అధిగమించిన చహాల్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన తొలి టీ-20లో ఆతిథ్య భారతజట్టు 8 వికెట్లతో కంగుతిన్నా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు మాత్రం రెండు అరుదైన ఘనతలు మిగిల్చింది.తన కెరియర్ లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ను చహాల్ అహ్మదాబాద్ తొలి టీ-20 ద్వారా పూర్తి చేయగలిగాడు. భారత్ తరపున టెస్టులు, వన్డేలు కలుపుకొని చహాల్ కు ఇది వందో మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉన్న రికార్డును సైతం చహాల్ అధిగమించాడు.

Also Read: డకౌట్ల ఊబిలో విరాట్ కొహ్లీ

ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ ను ఎల్బీడబ్ల్యుగా అవుట్ చేయడం ద్వారా తన టీ-20 కెరియర్ లో 60వ వికెట్ పడగొట్టగలిగాడు. దీంతో బుమ్రా పేరుతో ఉన్న 59 వికెట్ల రికార్డును చహాల్ అధిగమించగలిగాడు.బుమ్రా 50 టీ-20 మ్యాచ్ ల్లో 20.25 ఎకానమీతో 59 వికెట్లు పడగొడితే చహాల్ మాత్రం కేవలం 46 మ్యాచ్ ల్లోనే 24.75 ఎకానమీతో 60 వికెట్లు పడగొట్టడం విశేషం.బుమ్రా ఒక్కో వికెట్ కు 8.34 పరుగుల చొప్పున ఇస్తే చహాల్ 6.66 పరుగులకు ఓ వికెట్ చొప్పున పడగొట్టగలిగాడు.

2016 నుంచి 2021 వరకూ:

2016 లో హరారే వేదికగా జింబాబ్వే ప్రత్యర్థిగా తన తొలి టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన చహాల్ కు 54 వన్డే మ్యాచ్ ల్లో 92 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది.మొత్తం 46 టీ-20 లు, 54 వన్డేలతో కలుపుకొని భారత్ తరపున 100 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడినట్లయ్యింది.టీ-20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్ ఎవరంటే లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ అని చెప్పుకోక తప్పదు.

Also Read: అనుపమా కాదు…. సంజన..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles