- జాతీయ జెండా కు శాల్యూట్ చేయడం మనవిధి. లేకుంటే దేశ ద్రోహమే!
ఎర్ర కోటపై ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మువ్వన్నెల జెండా రెపరెపపలాడుతుంది. కానీ ఈ సారి జాతీయ జెండా పక్కన రైతు జెండా ఎగురవేశారు. ఇది నిజంగా దేశద్రోహం. ఎర్రకోట చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చాక ఇలా విద్రోహా చర్య జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ జెండా ఎగురవేసి పారిపోయిన పంజాబ్ కు చెందిన జూగ్రజ్ సింగ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. దీనికి ప్రేరేపించిన వారి పై కేసులు నమోదయ్యాయి.
అది రైతు జెండానా – ఖల్సా జెండా అనే విషయం పక్కన బెడితే జాతీయ జెండాకు అవమానించే వారికి జైలు జీవితం ఖాయం. ఎర్రకోట విశిష్టత గురించి చెప్పాలంటే, ప్రతి ఆగస్ట్ 15 న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ఎర్రకోట నుండి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కోటను 15 వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. బ్రిటిష్ వారు ఇండియాను ఆక్రమించాక ఆ కోట లో బ్రిటిష్ సైనిక స్థావరం ఏర్పాటు అయింది. మొగల్ చక్రవర్తి షాజహాన్ 1639 మే19 న నిర్మాణం ప్రారంభించి 1648 ఏప్రిల్ 6 న పూర్తి చేశారు. ఇందులో రాణి వాసం, గుర్రపు శాలలు కూడా ఉండేవి. ఎర్ర కోట అనే పేరు హిందూస్థానీ లో లాల్ కిలా గా పిలుస్తారు. ఈ కోటను ఎర్ర ఇసుకరాయి గోడలతో నిర్మించారు. లాల్ హిందూస్థానీ భాష నుండి “ఎరుపు”, ఖలాహ్ పెర్షియన్ పదం నుండి “కోట” అని అర్ధం. మొగల్ సామ్రాజ్య కుటుంబం నివాసంగా ఈ కోటను మొదట “బ్లెస్డ్ ఫోర్ట్” (కిలా-ఇ-ముబారక్) అని పిలుస్తారు. 1638 మే 12 న చక్రవర్తి షాజహాన్ ఎర్ర కోట నిర్మాణాన్ని ప్రారంభించాడని మరో కథనం ఉంది. అతను తన రాజధానిని ఆగ్రా నుండి డీల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి ఎరుపు మరియు తెలుపు, షాజహాన్ యొక్క ఇష్టమైన రంగులు. ఈ కోట రూపకల్పన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ కి నిర్మాణ పనులు అప్పగించారు. అతను తాజ్ మహల్ ను కూడా నిర్మించాడు. ఈ కోట యమునా నది వెంట ఉంది. ఎర్ర కోట చుట్టూ ఉన్న కందకాలకు యమునా నది నీరుతో నింపి శత్రు దుర్భేద్యంగా మార్చారు. 1638 న పవిత్రమైన మొహర్రం నెలలో నిర్మాణం ప్రారంభమైందని అంటారు. షాజహాన్ మరణాంతరం మొగల్ చక్రవర్తుల హత్యలు, సైనికుల ఆత్మ హత్యలతో కోట బ్రిటిష్ వారు వశం అయింది.
Also Read : రైతుల ఉపవాస దీక్ష…కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
జాతీయపతాక నియమావళి కఠినం
జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం! బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాతీయపతాకం తగు నిర్దేశకాలం ప్రకారమే జాతీయ జెండా నియమ నిబంధనలు రూపొందించారు. నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు!
ఈ నియమావళి చాలా కఠినంగా ఉందనీ, సాధారణ పౌరులు తమ ఇండ్లమీద, ఇతర భవంతులమీద జెండానెగరేసే అవకాశం లేకుండా చేసిందనీ విమర్శలుండేవి. చాలా సంవత్సరాలు కేవలం ప్రభుత్వ భవంతులమీదనూ, ప్రభుత్వాధికారుల నివాసాలపైన మాత్రమే జెండానెగరేసే ఆధికారముండేది. 2001 లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టులో ఒక కేసు గెలవడంతో ఆ పరిస్థితి మారిపోయి దేశపౌరులందరికీ జెండానెగరేసే అవకాశం కలిగింది. జెండాను నడుం కింది భాగంలోగాని, లోదుస్తులమీదగానీ ధరించరాదని నియమావళిని 2005లో సవరించారు!
Also Read : సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
కోర్టు కేసుతో మారిన నిబంధనలు
2002కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగత రోజుల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాని ఎగురవేయగా అధికారులు దాని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. జిందాల్ నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని వాదించాడు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది రాజ్యాంగ చట్టం! ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీం కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్ కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారత రాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది!
Also Read : ఎర్రకోటను ముట్టడించిన రైతులు
పతాకాన్ని గౌరవించడం ఎలా?
భారతీయ చట్టం ప్రకారం జెండాను ఎల్లవేళలా “గౌరవంతో, విధేయతతో” చూడాలి. 1950 స్థానంలో వచ్చిన జాతీయపతాక నియమావళి – 2002 పతాకం వాడకం, ప్రదర్శనలకు సంబంధించిన సరికొత్త నియమావళి ఏర్పాటు చేశారు.
Also Read : రైతుల అభివృద్ధి కోసమే సాగు చట్టాలు
దీని ప్రకారం పతాకం ఎప్పుడూ నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్ గా గానీ, ప్లాట్ ఫాం ముందుగానీ వాడరాదు. విగ్రహాలమీద, ఇతర వస్తువుల మీద గానీ కప్పరాదు. 2005 వరకు దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడడం నిషిద్ధంగా ఉండేది. 2005 న సవరించబడిన నియమావళి ప్రకారం దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడవచ్చు. ఐతే, నడుం కిందిభాగంలో, లోదుస్తుల మీద వాడరాదు! జెండాను దిండుగలీబులమీద, చేతిరుమాళ్ళమీద ఎంబ్రాయిడర్ చేయడం కూడా నిషిద్ధం.
ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయడం, దేంట్లోనైనా ముంచడం, ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం కూడా నిషిద్ధం.
Also Read : హింసాత్మకంగా కిసాన్ పరేడ్
పతాకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
జెండా గౌరవాన్ని కాపాడడానికి పాటించవలసిన సాంప్రదాయిక నియమాలు అనేకం ఉన్నాయి. బహిరంగప్రదేశాల్లో వాతావరణపరిస్థితులతో నిమిత్తం లేకుండా సూర్యోదయమప్పుడు ఎగురవేసి, సూర్యాస్తమయమప్పుడు దించివేయాలి. ఐతే ప్రత్యేకపరిస్థితుల్లో పబ్లిక్ భవంతి మీద రాత్రిపూట కూడా ఎగరనివ్వవచ్చు.
Also Read : నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు
జెండాను ఎప్పుడూ తలకిందులుగా చూపించరాదు, ఎగురవేయరాదు, చిత్రించరాదు. నిలువుగా ధరించినప్పుడు సరిగ్గా 90 డిగ్రీలు తిప్పడంతో బాటు జెండాను తిప్పి ధరించాలి. దారాలు ఊడిపోయిన, మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించడమంటే జెండాను అవమానించడమే! పతాకావిష్కరణకు వాడే జెండాకఱ్ఱలకు, జెండాను కఱ్ఱకు కట్టే తాడుకు కూడా ఇలాంటి నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ సరైన స్థిలో ఉండేట్టు జాగ్రత్త వహించాలి.
జాతీయపతాకాలను టేబుళ్ళు, వేదికలు, పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.
ఇతర దేశాల జాతీయపతాకాలతో
మనదేశంలో బహిరంగప్రదేశాల్లో ఇతరదేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసేటప్పుడు ఇది కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) మొట్టమొదటిదిగా ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లీషులో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. ఏ పతాకమూ ఈ పతాకం కంటే పెద్దదిగా ఉండకూడదు. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలేగానీ ఏ ఒక్క జాతీయపతాకమూ మరొక జాతీయపతాకం మీద ఉండకూడదు.
Also Read : రైతు ఉద్యమంలో దేశద్రోహులు
అలాంటి సందర్భాల్లో పతాకాల వరస మొదట, చివర, అక్షరక్రమాన్ని బట్టి మధ్యలోనూ కూడా ఈ పతాకాన్ని ఎగరేయవచ్చు. పతాకాలను వృత్తాకారంలో ఎగరేసినప్పుడు ఈ పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. ఈ పతాకాన్ని అన్నిటికంటే ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి.
గదిలో పతాకాన్ని ప్రదర్శించడం
పతాకాన్ని హాళ్ళలోగానీ, గదుల్లోగానీ నిర్వహించే సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ప్రదర్శించాలి – ఇది అధికారాన్ని సూచించే స్థానం కాబట్టి. వక్తలు ఉపన్యసించేచోటికి దగ్గరలో ఉన్నట్లైతే ఇది వారికి కుడిచేతి వైపునే ఉండాలి. వేరే ఎక్కడైనా ఉన్నట్లైతే సభికులకు కుడివైపున ఉండాలి.
కాషాయరంగు పైన ఉండేటట్లు పూర్తిగా విస్తరించి ప్రదర్శించాలి. నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. ఇలా బోలెడన్ని నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఏ నిబంధనను ఉల్లఘించిన దేశ ద్రోహమే!
Also Read : హస్తినలో టెన్షన్…టెన్సన్
Also Read : ఢిల్లీలో కిసాన్ పరేడ్
very good story Ramprasad rao garu…