ప్రజాస్వామ్యం అంటే ప్రజల రాజ్యం
తమ నాయకుడిని తామే నియమించుకునే అధికారం
తమ భవిష్యత్తు తామే నిర్ణయించుకునే అవకాశం.
ఎన్నికలు వస్తాయి
నాయకులు వస్తారు
అదీ ఇదీ ఇస్తారు
నిన్ను ఒకరొజు సంతోష పెట్టి
వాళ్ళు ఐదేళ్ళు సంతోషంగా దండుకుంటారు
వీధుల్లో తొడ కొట్టే రౌడీలు
నోరెత్తితే తంతాననే గూండాలు
నీకు దండం పెడుతూ వస్తారు
అన్నీ ఇస్తా, ఇంటికే పంపిస్తా అంటారు
కులం మతం పార్టీ అంటారు
మనోడినే అంటారు
నమ్మి మురిసి పోకు
మంచోడికి
నలుగురికీ మంచి చేసే వాడికి
జై కొట్టి నీ ఓటు వెయ్
ఆ నాడే నిజమైన పండగ.