• ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కలపల్లి గేట్, అంబేద్కర్ చౌరస్తా వద్ద నేను సైతం మరియు కమ్యూనిటి పొలిసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన 33 సిసి కెమెరాలను రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని పోలీస్ కమీషనర్ అన్నారు.
అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని సీపీ తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు.సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని సీపీ తెలిపారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.
Also Read: వామనరావు దంపతుల హత్య కేసులో 5వ నిందితుడు లచ్చయ్య అరెస్ట్
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. సీసీ కెమెరా ల ఏర్పాటు కు కృషి చేసిన వారిని సీపీ అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటు కి సహకరించిన దాతలను శాలువా తో సీపీ సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో డీసీపీ పెద్దపల్లి పి. రవీందర్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, సీఐ రామగుండం కరుణాకర్ రావు, ఎస్ఐ స్వరూప్ రాజ్, ఎస్ ఐ అంతర్గం శ్రీధర్,14 డివిజన్ కార్పొరేటర్ నీల పద్మ-గణేష్ గారు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Also Read: రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం