Sunday, December 22, 2024

జుబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి: హక్కుల నేతలు

  • రాష్ట్రంలో అత్యచారాలూ, హత్యలకు  అంతులేకుండా ఉంది
  • రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోంది, ప్రజలలో అభద్రతాభావం పెరుగుతోంది
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కి హక్కుల నేతల బహిరంగ లేఖ

హైదరాబాద్: జుబిలీ హిల్స్ లో ఒక మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారం జరిగిన కేసును వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మానవ హక్కుల నేతలు జయవింధ్యాల, హరీత్ రూఢ, దామోదరరెడ్డి, ఇక్బాల్ ఖాన్ తదితరులు బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇది:

శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు,

తెలంగాణ రాష్ట్రం , ముఖ్యమంత్రి కార్యాలయం,   ప్రగతిభవన్,

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.

అయ్యా ,

మేము పౌర సామాజిక క్రియాశీల కార్యకర్తలముగా రాయు ఈ లేఖ ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా .. .. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత .. ఎప్పుడూ జరగని, వినని సంఘటనలు 2019 నవంబర్‌ 27 రాత్రి నుండి జరుగుతున్నాయి. [అంతకు ముందు జరగలేదు అని మా భావన కాదు. ఉమ్మడి రాష్ట్రం లో జరిగినట్లే ఇంకా జరుగుతున్నాయి, ఇంకా రాష్ట్రం సర్దుకోలేదు అని భావించాము]. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారనే సంఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసింది. చివరికి నిందితులను (మహమ్మద్ ఆరీఫ్(26), మిగిలిన ముగ్గురు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు (మైనర్స్) ఎన్ కౌంటర్ పేరుతో బాధిత కుటుంబానికి పోలీసులు న్యాయం చేశారు. పోలీసుల చర్యకు మెజారిటీ ప్రజలు ఆనందం, హర్షం వెలిబుచ్చినట్లు ప్రచార మాధ్యమాలలో వచ్చింది. ఆ తరువాత VS సిర్పుర్కర్ న్యాయమూర్తి ప్యానెల్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేసింది. సుప్రీం కోర్టు ఎన్కౌంటర్ లో పాలుగొన్న పోలీస్ అధికారులపై 302, తదితర ఐపిసి సెక్షన్స్ కింద విచారణ చేయాలనీ ఆదేశించింది.

దిశపై అత్యాచారం, కాలపెట్టి చంపటం, నిందితులను ఎదురు కాల్పులలో పోలీసులు చంపటం నుండి 10-06-2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భయాందోళనలకు దారి తీస్తున్నాయి. స్త్రీలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు రాష్ట్రంలో సాధారణం అయిపోయాయి. కరోనా పేరుతో రెండేళ్లు ప్రజలు ప్రపంచంతోను, దేశంతోనూ, రాష్ట్రంతోను సంబంధాలనే కోలుపోయారు. 2020 నుండి 2021 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆయినప్పటికినీ 2020 లో 17,791 హింస,   స్త్రీలపైన, 4200 దారుణాలు బాలబాలికలపై జరిగినట్లు NRCB లెక్కలు చెపుతున్నాయి. హైదరాబాద్‌లోనే  2020లో 467 కేసులు నమోదయ్యాయి. 2532 దారుణాలు దళితులపై – ఆదివాసీలపై జరిగినట్లు NRCB లెక్కలు తేల్చాయి.

2021లో తెలంగాణలో నమోదైన మొత్తం నేరాల్లో మహిళలపై నేరాలు తొమ్మిది శాతానికి పైగా ఉన్నాయి. వీటిలో 2,382 అత్యాచార కేసులు. 8,429 వరకట్న వేధింపుల కేసులు, 33 వరకట్నపు  హత్యలు, 160 వరకట్న మరణాలు,  4,476 స్త్రీల ఆత్మగౌరవానికి  భంగం కలిగించే కేసులు, 199 హత్యలు  జరిగినట్లు నమోదయ్యాయి. 2,567 పోక్సో కేసులు కూడా నమోదయ్యాయి. ఇవే కాకుండా కిడ్నాప్ మరియు సైబర్ క్రైమ్ కేసులలో కూడా మహిళలు, పిల్లలు ఎక్కువ శాతం మంది బాధితులు. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో 2020లో 265 అత్యాచార కేసులు నమోదైతే 2021లో 328కి పెరిగాయి, సైబరాబాద్‌లో 2020లో 310 అత్యాచార కేసులు నమోదు కాగా 2021లో 356 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో అత్యాచార కేసులు 2020లో 329 నుంచి 2021 నాటికి 377కి పెరిగాయి.

18 జూన్ 2021 న దొంగతనం కేసులో ఇంటరాగేషన్‌ పేరుతో పోలీసులు కొట్టిన దెబ్బలకు అంబడిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ కస్టడీలో చనిపోయింది. ఈ విషయాన్ని  పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం ప్రజా వాజ్యం వేసి హై కోర్ట్ దృష్టికి తీసుకవెళ్ళింది. ఈ నిర్బంధ హత్యను ఎందుకు సిబిఐ తో విచారణ జరిపించకూడదు అని రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసుల పనితీరు గురించి హై కోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి అడ్వకేట్ జనరల్  “దర్యాప్తు పూర్తి అయ్యింది, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ గౌరవనీయమైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సిబిఐ కి ఈ కేసును బదిలీ చేస్తే  శాంతి – భద్రతల కు చెందిన పోలీసులు  ఆత్మస్థైర్యంను కోల్పోతారు,’’ అని ఓపెన్ కోర్టు లో కోర్టుకు విన్నవించారు. కోర్టు మీ విన్నపాన్ని అంగీకరించి మరియమ్మ లాకప్ మరణం కేసును సిబిఐ కి అప్పచెప్పలేదు. మరియమ్మను అడ్డగూడూరు పోలీసులు  నిర్బంధ హత్య చేసిన తరువాత కూడా  తేదీ : 04 నవంబర్ 2021 దీపావళి రోజు పేకాట ఆడుతున్నారనే నెపంతో, కామారెడ్డి (నిజామాబాద్) జిల్లా బీచుకోండ మండలం, శాంతాపూర్ గ్రామం కు చెందిన భూమ్ బోయి (50) అనే రైతును బీచుకోండ పోలీసులు  కొట్టటం చేత చనిపోయారు. అలానే వారం తర్వాత 10 నవంబర్ 2021 న రామోజీ తండా, ఆత్మకూరు(S),  సూర్యాపేట (నల్లగొండ) జిల్లా కు చెందిన గూగులోతు వీర శేఖర్(23) అనే ఆదివాసీ రైతు పై ఆత్మకూరు(S) స్టేషన్‌లో పోలీసులు థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారు, నడవలేని స్థితి.

28 మే 2022 నాడు మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ లో తెరాస కి చెందిన నాయకుల పిల్లలు, AIMIM కు చెందిన నాయకుల పిల్లలు ఉన్నారు అని వచ్చిన వార్తను తెలంగాణ పౌర సమాజం నమ్మలేకపోయింది. రెండు పార్టీల సారధులు పొద్దున్న లేస్తే ప్రజలకు సుద్దులు చెపుతారు ఇలా ఎలా జరిగింది అని, వాస్తవం ఏంటని కనుక్కొనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం.

ఇద్దరు మేజర్లూ, ఆరుగురు మైనర్లూ

17 జూన్ 2022 నాడు మహమ్మద్ ఆజమ్ అలీ  కొడుకు మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ పెళ్లి ఇంపీరియల్ గార్డెన్ , బోయినపల్లి, సికింద్రాబాద్ లో జరుగబోతున్నది. ఈ సందర్భంగా తేదీ 28 మే2022 న మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ అనేనేషియా పబ్ లో బ్యాచులర్ పార్టీ ఏర్పాటు చేసినట్లు అందులో 8 మంది రొమేనియా బాలిక(17)ను పరిచయం చేసుకున్నట్లు, వీరు ఒక గ్యాంగ్ గా ఏర్పడి రేప్ చేసినట్లు వార్త బయటికి వచ్చింది. 29 మే 2022 నుండే రాజి ప్రయత్నం జరిగినట్లు, ఆ రాజీలో డబ్బులు అమ్మాయి తండ్రి డిమాండ్ చేసినంతగా ఇవ్వకపోవటమే పోలీస్ స్టేషన్ మెట్లు ఈ కేసు ఎక్కినట్లు బహిరంగంగానే అనుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. గ్యాంగ్ రేప్ లో ఇద్దరు మేజర్లు, 6 గురు మైనర్లు ఉన్నారని కేసు ప్రారంభంలో మాకు వచ్చిన సమాచారం.

ఈ గ్యాంగ్ రేప్ కేసు నుండి విజయవంతంగా మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ ను తప్పించే ప్రణాళిక తరువాతనే, పోలీసుల హడావుడి చేసిందనీ, మీడియా పరుగులు తీసిందనీ తెలిసింది. గతంలో మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ “హోమ్ మినిష్టర్ కు చెందిన బుగ్గ బండి” తో హల్ చల్ చేసిన యువకుడు. ఇది ప్రచార మాధ్యమాలలో కూడా వచ్చింది. ఈ  ఘటన లో తెరాస, AIMIM రాజకీయ నేతల కుమారులు ఇందులో నిందితులుగా ఉన్నట్టు  రోజురోజుకూ రూఢి అవుతున్నది. ఈ కేసు తో రాష్ట్ర ప్రభుత్వం పరువుకు భంగం కలుగుతున్నది. ప్రజలు ప్రభుత్వం తీరుపై ఆందోళనంగా ఉన్నారు. ఈ కేసుకు  రాజకీయ రంగు పులుముకోక  ముందే మంత్రుల ప్రక్షాళన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాము.

విజయవాడలో ఆనంద్ నిర్వాకం

ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్, IPS, గతంలో అనగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ కమిషనర్ గా పనిచేశారు. 27 డిసెంబర్ 2007 న విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో బాలికల హాస్టల్ లో ఉండి బి – ఫార్మసీ చదువుతున్న విద్యార్థి అయేషా మీరా (17) ను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అప్పట్లో అది సంచలనమైన వార్త. కోనేరు రంగా రావు మనవడు కోనేరు సతీష్ కారకులు అని అయేషా మీరా అమ్మ చెప్పింది. అయినప్పటికిని సత్యం బాబు అనే ఒక దళిత యువకుడిని అరెస్ట్ చేశారు. చివరికి సత్యం బాబు కాదని కోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు విజయవాడకు సీపీ గా ఉన్న సీవీ ఆనంద్ IPS, ఇప్పుడు హైదరాబాద్ సీపీ గా ఉన్నారు.

దోషులను తప్పించే ప్రయత్నం

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఎన్ని మెలికలు తిరుగుతున్నదో రోజు ప్రచార మాధ్యమాల ధ్వారా చూస్తున్నాము, వింటున్నాము. నిజమైన దోషులను తప్పించే ప్రయత్నమే జరుగుతున్నది. ఇందులో ఎలాంటి అనుమానం మాకు లేదు. ఒక మేజర్ ను, 5 మైనర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారులే, వీరు నేరస్థులు, వారు నేరస్థులు కారు అని నిర్ణయం చేస్తున్నారు. ఫలానా నాయకుడి కొడుకు రేప్ జరిగేటప్పుడు లేడు, ముద్దు పెట్టుకొనేటప్పుడు ఉన్నారని వారే ఒక ముగింపుకు వస్తున్నారు. దిశ కేసులో ఇప్పటికే నలుగురు అమాయకులైన యువకులు “తక్షణ న్యాయం” అనే ఫోబియాకు బలి అయ్యారు. అయేషా మీర(17) అత్యాచారం, హత్యా కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా పిడతల సత్యం బాబు ఏడేళ్ళు కారాగారపు జీవితం గడిపాడు. ఇది పోలీసుల విచారణ సామర్థ్యానికి అడ్డపడుతుంది.

రొమేనియా బాలికకు న్యాయం జరగాలని ఉన్నదా?

రొమేనియా బాలిక కు న్యాయం జరగాలి, జరిపించాలి అనే ఆలోచన మీలో ఉంటే  ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే ఆయా మంత్రి పదవుల నుండి తప్పించాలి. రాష్ట్రంలో పోలీసుల తీరు ఏం బాగాలేదు. రాష్ట్రంలో రోజూ మహిళలపై – బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. జూబిలీహిల్స్ గ్యాంగ్ రేప్ కు వచ్చిన ప్రచారం అన్నింటికీ రాకపోవచ్చు. ఈ గ్యాంగ్ రేప్ తరువాత  కార్ఖానా , మొఘల్పుర,  11 జూన్ 2022 న ఎల్ బీ నగర్ ప్రాంతంలోనూ , మహబూబ్ నగర్ జిల్లా  ప్రాంతంలోనూ   జరిగాయి. మతాంతర వివాహం చేసుకున్న  నాగరాజు ను సరూర్ నగర్ ప్రాంతంలో హత్య చేయటం, కులాంతర వివాహం చేసుకున్న నీరజ్ పన్వర్  బేగం బజార్ లో హత్య కావటం లాంటి హీనమైన నేరాలు ప్రజలలో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రభుత్వం తీరు మారాలి

ప్రభుత్వం  తీరు మార్చుకోవాల్సిన సమయం ఇది.  ప్రభుత్వం లాభాపేక్షతో నడవకూడదు, ప్రజా సంక్షేమంతో నడపాలి. ఒకవేళ లాభాపేక్షతో నడుపుతే  శాంతి – భద్రతల సమస్య తల ఎత్తుతుంది. మనుగడ అసాధ్యం అవుతుంది. జూబ్లీహిల్స్ రేప్ కేసును తక్షణమే సిబిఐ కి అప్పచెప్పాలని బాధ్యతనెరిగిన సామాజిక కార్యకర్తలుగా మేము కోరుతున్నాము.   

ధన్యవాదములతో          

.1.  జయ వింధ్యాల 9440430263                           2. హరీత్ రూఢ 8801711356

3. దామోదర్ రెడ్డి 9885634646                              4. బాలకిషన్ రావు

8466956090

5. ఇక్బాల్ ఖాన్ 9494869731                               6. ముత్యాల వెంకటేష్ గుణ

9652221716

7. తిరుమల్. T 9989151519                                8. సలీం 8801546313

9. D. శంకర్ 8801584705                                   10. సనావుల్లా ఖాన్

9440344381

11. సుభద్ర రెడ్డి 9059346260                                12. SN అమీన్ 9059707259

13. మానువాడ విజయ్ 8096969613                        14. గడ్డం అశోక్ 8522998224

15. Dr. షోయబ్ 7981123532                               16. పెండ్యాల అనంతయ్య

9493810363

17. బొబ్బిలి శారద 9948693242                             18. రాజేంద్రప్రసాద్ Y

9848602674

19. ఇస్లావత్ బాలాజి 9014580038                          20. కొమిరెడ్డి రాములi

9391029910

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles