విభజించు – పాలించు అన్నది
బ్రిటీషు వాళ్ల సూత్రం.
భారతీయుల చరిత్రను మార్చి
మనలను ఆర్యులు ద్రావిడులు
అంటూ విడదీశారు.
స్వతంత్ర్యం కావాలన్నపుడు
హిందువులు ముస్లిములు
అని విభజించారు
నిజానికి బ్రిటీషు వాళ్ళు
ఆంగ్ ల్స్, శాక్ జన్స్ అనే
రెండు జాతుల సమ్మేళనం.
స్వాతంత్ర్య భారతంలో
నల్ల దొరలు అదే సూత్రాన్ని
రిజర్వేషన్ పేరున
జనాన్ని విభజించి పాలిస్తున్నారు
సర్వం జగన్నాధం అన్న వేదోక్తిని
ఎప్పుడో పాతరేశారు.
నేటి భారతంలో
కల్లోలాలకు మూలం మతం కాదు
కొందరి రాజకీయం
హిందువులకు ప్రత్యేకంగా
ఒక్క మేలూ చేయని వారిని
హిందూ పక్షపాతిగా
రంగు పూస్తున్నారు
మిగతా వారందరినీ
ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు
ఒకళ్ళ పట్ల మరొకళ్లకు
ద్వేషం పుట్టిస్టున్నారు
ఈ విభజన రాజకీయాన్ని
విభజించే వాళ్లను వదలి
మంచి చేసే వాళ్లను
నాయకులుగా చేసుకోలేమా
అలా చేసుకోక రాజకీయుల
మాయ మాటలకు
తానతందాన అంటే
కొట్టుకు చావాల్సింది మనమేగా.
Also read: ఆ-కలి
Also read: మన రాజ్యం
Also read: స్త్రీ
Also read: ఆత్మావలోకనం
Also read: చదువు