- ఏప్రిల్ 17న పోలింగ్
- మే 2న ఓట్ల లెక్కింపు
తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ శాసనసభ, తిరుపతి లోక్ సభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 17న తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా జరగాల్సిన ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఆంధ్రుల ఆంతర్యం ఏమిటి?
నామినేషన్ల స్వీకరణకు మార్చి 30 తుది గడువుగా నిర్ణయించారు. మార్చి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనుండగా మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతితో తిరుపతి లోక్ సభకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రెండు చోట్లా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇదీ చదవండి: బీజేపీ, జనసేన మధ్య విభేదాలు ?