ఫొటో రైటప్: ఆదివాసీల మద్య అజయ్ కుమార్
గురువారంనాడు (08 జూన్ 2023) అనకాపల్లి జిల్లా ఐర్లా (అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం -AIARLA) ముఖ్య కార్యకర్తల సమావేశం, వలసలపాలెం అనే ఆదివాసీ గ్రామంలో జరిగింది. ఒక్కొక్క గ్రామం నుండి కార్యకర్తలు, తమ వద్ద వున్న సమస్య, ఇప్పటివరకు ఎం జరిగిందో చెపుతున్నారు.
రొచ్చుపనుకు గ్రామం ఒక చిన్న గ్రామం. అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కల్యాణ లోవ పంచాయితీలో ఇది ఆవాస గ్రామం. మొత్తం 35 కుటుంబాలు. కొండదొర ఆదివాసీలు. కొండల మధ్యలో ఈ గ్రామం వుంటుంది. ఆ కొండలను ఆనుకొని సారవంతమైన నేలలో వారు జీడి మామిడి తోతలు పెంచారు. ఆ పెరిగిన తోటలను చూస్తే అసలు వారు హాయిగా జీవించాలి. కాని పేదరికంలో కూరుకుపోయారు. కారణం షావుకారు/ వడ్డీ వ్యాపారుల దోపిడీ కోరలలో వారు చిక్కుకుపోయారు.
Also read: నాలుగు క్వార్టర్స్ బ్రాంది బాటిల్స్ – (మైనస్) ‘అత్యాచారం’ కేసులు = ??!!
గడచిన (ఎప్రిల్ / మే) జీడి పిక్కల సీజన్ లో ఆ కుటుంబాలకు అమ్ముకోవడానికి ఏమి మిగలలేదు. అదే గ్రామంలో రవి అనే యువకుడు వున్నాడు. తాను దివ్యాoగుడు. చురుకైనవాడు. తన కుటుంబo కూడా అప్పులలో కూరుకుపోయి వుంది. కొందరు షావుకారలైతే, “ఇక మీరు అప్పులు కట్టలేరు” అని చెప్పి వారి భుములను 99 సంవత్సరాలకు లీజుకు రాయించేసుకున్నారు. రవి లెక్కలు తయారు చేసాడు. నిజంగా తీసుకున్న అప్పు, దానికి షావుకార్లు కట్టిన వడ్డీ / చక్ర వడ్డీ లెక్కలతో ఒక పట్టిక తయారు చేసాడు. షావుకార్ల వద్ద చిక్కుకు పోయిన తోటలు, భూముల వివరాలు తయారు చేసాడు రవి.
ఈ నేపధ్యంలో ఐర్లా (AIARLA) వారికి అండగా నిలిచింది. రెండు నెలల ప్రయత్నం తరువాత, నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో రవి ఇలా రిపోర్టు చేశాడు. షావుకార్లు తమవద్ద వున్న ప్రామిసరీ నోట్లు తాశీల్దార్ కి అప్పగించారు. లీజు అగ్రిమెంట్లు, ఒరిజనల్ పాస్ పుస్తకాలు ఆదివాసీల చేతికి వచ్చాయి. రూ. 2,33,04559 (రెండు కోట్ల ముప్పైమూడు లక్షలు) రూపాయల రుణాలు ఇక లేవు. 11 ఎకరాల భూమి తిరిగి ఆదివాసీల స్వాధీనం అయ్యింది. అందులో ఒక ఎకరా వరిపండే పొలం. మిగిలింది జీడి మామిడి తోట. రోచ్చుపనుకు ఆదివాసీలు ఐర్లాలో సభ్యులైనారు.
జూన్ 22న “ఋణ విమోచన- భూ విమోచన” కెంపేయిన్
రోచ్చుపనుకు అనుభవాని ముందుకు తీసుకుపోవడానికి ఈ నెల 22 న ఒక రోజు, దూకులంపాడు గ్రామం నుండి బంగారుబందలు ఆవాసం వరకూ ‘ఋణ విమోచన’ పాదయాత్ర జరపాలని నిన్న జరిగిన ఐర్లా అనకాపల్లి కార్యకర్తల సమావేశం తీర్మనించిoది. పాద యాత్రలో ప్రధాన ప్రచార అంశాలు ఈ విధంగా వున్నాయి.
Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు
1. ఆదివాసీల నుండి ప్రామిసరీ నోట్స్ రాయించుకున్న గిరిజనేతర షావుకార్లు /వడ్డీ వ్యాపారులు తమ వద్ద వున్న పత్రాల జిరాక్స్ నఖలు తాము అప్పు ఇచ్చిన ఆదివాసీకి ఇవ్వాలి. అలా ఇవ్వకపొతే “అప్పులేనట్లే”.
2. భూములు / తోటల లీజు పత్రాలను అవి రాయించుకున్న గిరిజనేతరులు తమ వద్ద వున్న పత్రాల జిరాక్స్ నఖలు భూ యజమానైన ఆదివాసీకి ఇవ్వాలి. అలా ఇవ్వకపొతే “లీజు లేనట్లే”.
3. ఆదివాసీ జీడి మామిడి రైతులారా! మీ తోటలలో పనులకు మన పాత సాంప్రదాయ పద్దతైన ‘సహాయాల” (ఒకరికి మిగిలిన వారు సాయం) పద్దతిని మళ్ళీ ప్రారంభిద్దాం. దీని వలన కూలి/వేతన పెట్టుబడి మిగిలుతుంది.
4. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడవద్దు. దీనివలన కూడా పెట్టుబడి బాగా తగ్గిపోతుంది.
Also read: ఇచ్చిన మాటకు కట్టుబడండి, బాధితుల డిమాండ్
5. కళ్యాణలోవ జీడి మామిడి పంట అంటే అది సేంద్రియ పంట అనే పేరు తీసుకువద్దాం.
6. ప్రతి గ్రామంలో చందాలు వేసుకొని ఒక తూనికల కాటా కొనుగోలు చేసుకుందాo. కొనుగోలులో మీకు సంఘం సహకరిస్తుంది.
7. కళ్యాణ లోవ ఆదివాసీ సేంద్రియ జీడి మామిడి రైతుల పరస్పర సహకారాన్ని సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం.
జూన్ 24 కరకయ్య సంస్మరణ : ASM ప్రధమ సమావేశం
మే 21, ఆదివారం, తమ పట్టాదారు పాసు పుస్తకాలు చేతికి వచ్చాయని. గ్రామానికి వెళ్లి తోట చూసుకోవాలని పోటుకూరి కరకయ్య, ఆయన భార్య, ఆడపిల్లలు ఇతర ఆదివాసీ రైతులతో కలసి రొచ్చుపనుకు బయలు దేరారు. దారిలో ఆటో ప్రమాదానికి గురయ్యింది. కరకయ్యతో బాటు ఐగురికి బాగా దెబ్బలు తగిలాయి. నర్సిపట్టణం ఏరియా ఆసుపత్రిలో కరకయ్య నాలుగు (4)గంటల సమయంలో మరణిoచాడు. ఒక చేతిలో భర్త మృత దేహం మరో చేతిలో భూమి పత్రాలు!
జూన్ 24, శనివారం, రొచ్చుపనుకు గ్రామంలో పోటుకూరి కరకయ్య సంస్మరణ సభ జరుగుతుంది. ముఖ్య అతిధిగా కామ్రేడ్ క్లిప్టన్ డి. రొజోరియో, కర్ణాటక హై కోర్టు న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ అసోషియేషన్ ఫర్ జస్టిస్ (AILAJ) జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగుళూరు, పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకూ ఈ సమావేశం జరుగుతుంది. అనoతరం అఖిల భారత ఆదివాసీ సంఘం (ASM) AP విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆసక్తి కలిగిన మిత్రులoదరూ పాల్గోవాలని ఆహ్వానిస్తున్నాం.
Also read: వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!
P.S. అజయ్ కుమార్,
జాతీయ కార్యదర్శి, AIARLA