కాముని పున్నమి.
సకల జీవుల మనోమోహనుడు
తరతరాలకు మోహానంద దాయకుడు
జీవ స్రవంతికి కారకుడు
ప్రాణికోటి ఆరాధ్య స్వామి మదనుడు.
రతీదేవి నలరించే సుమ బాణుడు
సృష్టికి మూలశక్తిగా భాసిస్తూ
శృతిమీరి సదాశివుని స్పృశిస్తే
తనువు బాసి బూడిదైనాడు.
మోహం అమందానందకరం
శృతి మించితే
గతి తప్పితే
మిగిలేది విషాదం.
మితి తప్పని మోహం
పరిణామంతో పక్వమై
మూడో నేత్రంగా మారాలి
మూడో కన్ను తెరుచుకోవాలి
కామ దహనం జరగాలి.
కామంతో మొదలై
కామ దహనంతో ముగిసే
సృష్టి చక్రం తిరగాలి
తరంతరం నిరంతరం.
Also read: “కర్తవ్యం”
Also read: “రాగ భంగం”