తెలంగాణ అసెంబ్లీ కి జరిగిన పోలింగ్ సరళి తమకు నమ్మశక్యంగా లేదని బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లడుతూ, బిఆరెస్ కు 70 సీట్లు వస్తాయిని ధీమా వ్యకం చేసారు. ఎగ్జిట్ పోల్స్ సరళిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఒక వైపు పోలింగ్ జరుగుతూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ ఏమిటని ప్రశ్నించారు. 2014, 2018లలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని అయన గుర్తు చేసారు. ఐతే పోలింగ్ ఫలితాలు బిఆరెస్ కు అనుకూలంగా వచ్చాయన్న మాట వాస్తవం కదా అని అడిగారు. కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వస్తున్నాయియని, దీన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా ఆయన ప్రశ్నను తోసిపుచ్చారు. క్షేత్రస్థాయి నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందన్నారు.