బ్రిటిష్ రాణి ఎలిజెబెత్ – II గురువారంనాడు స్కాట్లాండ్ లో మరణించారని బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ‘‘బల్మోరాల్ ప్యాలస్ లో గురువారం మధ్యాహ్నం ఎలిజెబెత్ రాణి ప్రశాంతంగా కన్నుమూశారు. రేపు లండన్ కు ఆమె భౌలిక కాయాన్ని తరలిస్తారు’’ అని ప్యాలస్ ప్రతినిధి ప్రకటించారు. ఆమె వయస్సు 96 ఏళ్లు. వైద్యులు ఆత్రుత వెలిబుచ్చడంతో ఆమె కుటుంబసభ్యులు బల్మొరాల్ ప్యాలస్ కు చేరుకున్నారు. ఆమె మనవడు హారీ, అతడి భార్య మేఘన్ మార్కెల్ కెనడా నుంచి స్కాట్లాండ్ వచ్చి ప్యాలస్ కు చేరుకున్నారు. వారిద్దరికీ రాణితో వివాదం ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని మాసాలుగా రాణి బలహీనంగా కనిపించారు. బ్రిటిష్ రాణిగా ఏడు దశాబ్దాలు పూర్తి చేసిన సందర్భంలో జూన్ లో ప్లాటినమ్ జూబిలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ తన 99వ ఏట నిరుడు మరణించారు.
మొన్ననే మూడవ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్ కు బాధ్యతలు అప్పగించారు. ఆమె ఆరోగ్యం గురించి ఊహాగానాలు గురువారంనాడు ఎక్కువైనాయి. ఈ కారణంగానే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విలేఖరుల గోష్ఠిని ఆలస్యం చేశారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రాణి తన ఆలోచనలలో, ప్రార్థనలో ఉన్నారని అన్నారు. బ్రిటిష్ ప్రధాని లిజ్ ట్రస్ తో విడియో కాన్ఫరెన్స్ లో ఉక్రేయిన్ గురించి మాట్లాడుతూ మధ్యలో రాణి ఆరోగ్యం గురించి ప్రస్తావన తెచ్చారు. తనకు ఇష్టమైన బల్మోరల్ ప్యాలెస్ లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘ఆపరేషన్ యూనికాన్’ అనే కోడ్ పేరుతో రాణి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్యారిస్ లో బ్రిటిష్ రాయబార కార్యాయలం వెలుపల ఎలిజెబెత్ రాణి ఫోటీ వేలాడ దీశారు. నిరుడు అక్టోబర్ నుంచి రాణి ఆరోగ్యం బాగుండటం లేదు. సీనియర్ రాజకీయ సలహాదారులతో బుధవారం జరగవలసిన సమావేశాన్ని రాణి రద్దు చేసుకున్నారు. మంగళవారంనాడు స్కాటిష్ హైలాండ్స్ లో బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ తోనూ, పదవీ విరమణ చేసిన ప్రధాని బోరిస్ జాన్సన్ తోనూ సమావేశమైనారు. ఫ్రాన్స్ రాజు లూయిస్ 15 తర్వాత అత్యంత ఎక్కువకాలం అధికారంలో ఉన్న రాణిగా ఎలిజెబెత్ పేరు తెచ్చుకున్నారు. ధాయ్ లాండ్ రాజు భూమిడో అదులేదీజ్ 70 సంవత్సరాల 126 రోజులు (1927కూ 2016కూ మధ్య) రాజుగా ఏలారు. ఫ్రాన్స్ కు చెందిన లూయీ 1643 నుంచి 1715 వరకూ 70 సంవత్సరాల 110 రోజులు పదవిలో ఉన్నారు. ఎలిజెబెత్ – 2 కి 1953లో రాణిగా కిరీటం పెట్టుకున్నారు. 2015లో అత్యంత ఎక్కువకాలంగా బ్రిటిష్ రాణిగా ఉన్నఖ్యాతి గడించారు. అంతవరకూ రికార్డు ఎలిజెబెత్ తల్లికి అమ్మమ్మ విక్టోరియా రాణి. డెబ్బయ్ సంవత్సరాలు బ్రిటిష్ సింహాసనంపైన కూర్చున్నఒకే ఒక వ్యక్తిగా ఎలిజెబెత్ రాణి చరిత్రకెక్కారు.