• ఇండియాను కలవరపెడుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు
• అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
బ్రిటన్ కు విమాన రాకపోకలపై ఉన్న ఇప్పటికే ఉన్న నిషేధాన్ని 2021 జనవరి 7 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆ తర్వాత కఠిన ఆంక్షలు విధించి సర్వీసులు మెల్లగా పునరుద్దరిస్తామని దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ట్విటర్ లో తెలిపారు.
ఇది చదవండి: మరో భయంకర కరోనా
కలవరపెడుతున్న స్ట్రెయిన్ కేసులు:
బ్రిటన్ నుంచి భారత్ తిరిగి వచ్చిన వారిలో పలువురికి కరోనా స్ట్రెయిన్ సోకినట్లు తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కొత్త స్ట్రెయిన్ 20 మందికి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో వీరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్ లో ఉంచినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి పాజిటివ్ గా నిర్ధారణ అయినవారికి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు.
ఇది చదవండి: కోవిద్ ‘టీకా’తాత్పర్యం
ఆందోళనలో ప్రపంచ దేశాలు:
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ ఆనందంలో ఉన్నవారికి వైరస్ కొత్త రూపు సంతరించుకుని స్ట్రెయిన్ రూపంలో వస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తితో ప్రంపంచదేశాలు వణికిపోతున్నాయి. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ అతివేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. సాధారణ వైరస్ కంటే 70 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.
ఇది చదవండి:దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కు ముమ్మర ఏర్పాట్లు