• కరోనా స్ట్రెయిన్ తో బ్రిటన్ లో కలవరం
• వ్యాక్సిన్ వేయించుకున్న 6 లక్షల మంది
కరోనా స్ట్రెయిన్ తో సతమతమవుతున్న బ్రిటన్ తాజాగా మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి మంజూరు చేసింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు ఈ రోజు ఆమోదం లభించింది. వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీని చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇది చదవండి: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కు ముమ్మర ఏర్పాట్లు
100 మిలియన్ ఆస్ట్రా జెనికా డోసుల ఆర్డర్:
ఈ నెల మొదట్లో ఫైజర్ బయోఎన్ టెక్ టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 6 లక్షల మంది టీకా వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్తరూపు సంతరించుకున్న కరోనా స్ట్రెయిన్ తో తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఇపుడు మరో టీకాకు అత్యవసర ఆమోదం తెలిపి వినియోగంలోకి తెచ్చింది. 100 మిలియన్ ఆస్ట్రా జెనికా డోసులను ఆర్డర్ చేసింది. జనవరి తొలివారంలో వ్యాక్సినేషన్ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా స్ట్రెయిన్ కేసులు వేలసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ స్ట్రెయిన్ బాధితులతో నిండిపోతున్నాయి.
ఇది చదవండి: కోవిద్ ‘టీకా’తాత్పర్యం
అమెరికాలో రెండు వ్యాక్సిన్లు:
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చారు. ఫైజర్ తో పాటు మోడెర్నావాక్సిన్ కూడా యూఎస్ ఎఫ్ డీఏ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
భారత్ లో అనుమతులు వేగిరం:
యూకేలో ఆక్స్ ఫర్డ్ టీకాకు అనుమతులు రావడంతో ఇండియాలో వ్యాక్సిన్ విడుదల చేసేందుకు అవకాశాలు మెరుగు పడ్డాయి. ఇండియాలో ఓ వైపు కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొత్తగా కరోనా స్ట్రెయిన్ కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తక్కువ ధర ఉండటంతో పాటు భద్రపచడం కూడా సులువుకావడంతో వ్యాక్సిన్ వినియోగంపై పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తోంది
ఇది చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం పొడిగించిన కేంద్రం