తాతగారి కచేరీ గదిలో చార్లెస్ బ్రాడ్లా ఫోటో అద్దం కట్టి ఉండేది…. ఆయన గురించి తాత గారు ఏం చెప్పారంటే..
” బ్రాడ్లా ఎప్పుడూ హిందూ దేశం గురించే మాట్లాడేవాడు. కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్ ని బ్రిటిష్ వారు పదవీ చ్యుతుణ్ణి చేసి కాశ్మీరుని తమ రాజ్యంలో కలుపుకున్నారు.ఇది బహు అన్యాయమని బ్రాడ్లా హౌస్ ఆఫ్ కామన్స్ లో వాదించాడు. బ్రాడ్లా హిందూ దేశాన్ని సందర్శించాడు. అతడు మన దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతా పూర్వకంగానూ, అతని జ్ఞాపకార్దమున్నూ లాహోర్ పట్నంలో ‘ బ్రాడ్లా హాల్ ‘ అని ఒక భవనం క ట్టించారు ప్రజలు. అది నేటికీ లాహోర్ లో ఉంది “
( ‘బతుకుపుస్తకం’ లో ఉప్పల లక్ష్మణరావుగారు కోట్ చేసిన తన తాత గారి మాటలు )
26 సెప్టెంబర్ బ్రాడ్లా జయంతి