మాతృదేవోభవ
పితృదేవోభవ
సీతారాములు
లక్ష్మీనారాయణులు
పార్వతీపరమేశ్వరులు.
నవమాసాలు మోసింది అమ్మ
అద్వితీయ బాధ భరించి కన్నది అమ్మ
పాలిచ్చి పెంచింది అమ్మ
ఆప్యాయత పంచింది అమ్మ
ప్రత్యక్ష దైవం అమ్మ.
పోషించేది నాన్న
రక్షణ నాన్న
నడత నాన్న
గౌరవం నాన్న
వెన్నెముక నాన్న
తెర వెనుక బొమ్మ నాన్న.
జీవన గమనానికి చక్రాలు
అమ్మానాన్నలు
రెండు చక్రాలు సమానం
రెండూ అవసరం
కాని లోకాచారం
ముందు అమ్మ
తర్వాత నాన్న
ప్రకృతి పురుషుడు
దేవుళ్లైనా అంతే.
Also read: తెలుగు
Also read: త్రిలింగ దేశంలో హత్య
Also read: మార్గదర్శి
Also read: బేరీజు
Also read: కశ్మీర్