(విశిష్ట భావోద్యమ దంపతుల పరిచయం)
దేశంలోనే ఒక అరుదైన, అద్భుతమైన భావోద్యమ తాత్విక ఆశ్రమం నిర్మించిన దంపతుల్ని గురించి గతంలో రాసిన వ్యాసాల్నిలా ఒక్కదరికి చేర్చడం జరిగింది. నాన్న మేకా సత్యనారాయణశాస్త్రి(బాంబు) రెండోవర్ధంతి సందర్భంగా యాళ్ళ దంపతుల కృషిని గురించి చేసిన యత్నం ఇది!
నాన్నకీ, యాళ్ళకీ పరిచయం ఉంది. ఇద్దరిదీ పార్వతీపురమే. ఒకనాటి అర్ధరాత్రి ఫోన్చేసినేను ఇంట్లో లేకపోతే రాత్రంతా స్టేషన్‌లో ఉండి తెల్లవారు జామున ఇంటికొచ్చి పుస్తకాలేవో ఇచ్చినప్పుడు నాన్నతో కాసేపు గడిపారు. యాళ్ళ ముక్కుసూటితనం, నిర్మొహమాటం, నిరాండం బరత ఇప్పటికీ ఆశ్చర్యమే!
‘శాస్త్రీయ ఆలోచనలు పెంపొం దించు దాతృత్వ సంస్థ’ దేశం లోనే ఏకైక విలక్షణమైన భావో ద్యమ ఆశ్రమం. దానిని కాపాడు కోవడం ఆలోచనా పరులు అందరి కర్తవ్యం. యాళ్ళ వర్ధంతి రోజు ఆయన కోసం రాసిన పది పుటల చిరు పొత్తాన్ని అందుకే ఇలా తీసుకు రావడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు యాళ్ళ దంపతుల కోసం చదవాలి!
ఆసక్తి ఉన్న మిత్రులు, ముఖ్యంగా అభ్యుదయ ప్రగతిశీల భావోద్యమ మిత్రుల కోసం సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. ఆర్థిక సౌలభ్యం ఉన్న మిత్రులు మా ప్రయత్నాలకు సహకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే సంతోషం. చదివాక విలువైన మీ విమర్శలకు ఆహ్వానం!
– గౌరవ్