పుస్తకం ఎంత అద్భుతమైంది?
చెట్టుతో తయారైన ఒక బల్లపరుపు వస్తువు
సులభంగా అటూ ఇటూ కదలగలిగే విచిత్రం
తెల్లటి ఒంటిమీద కొన్ని గజిబిజి ఆకారాలు
అద్దుకుని, నీకోసం ఎదురు చూసే వస్తువు
ఒకే ఒక్క చూపుతో చూస్తే చాలు-
నవ్వు మరొకరి మెదడులోకి
నేరుగా ప్రవేశించగలవు –
ఆ మరొకరు బహుశా…
వేల ఏళ్ళ క్రొతమే కన్నుమూసినవారు కావొచ్చు..
వేల ఏళ్ళ తర్వాత కూడా కొందరు రచయితలు
నిశ్శబ్దంగా, స్పష్టంగా నీ తలలో మాట్లాడుతున్నారూ
అంటే – రాయడం అనేది
మానవుడి ఆవిష్కరణలో ఎంత గొప్పది?
ఎంత సున్నితమైంది? ఎంత సుందరమైందీ?
నీ పరిచితులని, అపరిచితులని
వేల వేల యుగాల్లో
వేరు వేరు దేశాల్లో
ఉన్నవాళ్ళందరినీ ఒక్కటిగా కలిపేది!
కాలం అడ్డు గోడల్ని ధ్వంసం చేసేది!!
మానవ మేథకు ఒక ఉదాహరణ – పుస్తకం!
మనిషి మహాద్భుతాలు సాధించాడనడానికి –
ఒక రుజువు!!
Also read: నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు
Also read: ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!
Also read: హృదయంలో మేధస్సు
Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా