————————-
(‘BODY AND SOUL ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత:డా. సి.బి.చంద్ర మోహన్
47. సంచారి తత్త్వాలు
—————————-
ఒక వసంత కాలంలో, తెరిచి ఉన్న కిటికీ దగ్గర ఒక యువకుడు, ఒక యువతి కూర్చొని ఉన్నారు. వారిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చొన్నారు. ఆ యువతి “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అందగాడివి. ధనికుడివి. ఎప్పుడూ మంచి దుస్తులలో ఉంటావు.” అంది.
ఆ యువకుడు “నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నీవొక అందమైన భావానివి. చేతిలో ఇమడనంత వస్తువువి. నా స్వప్నాల్లో ఒక గీతానివి.” అన్నాడు.
కానీ ఆమె కోపంతో ఇంకో వైపుకి తిరిగి ఇలా అంది “సార్! మీరు నన్ను వదిలేయండి. నేనేమీ భావాన్ని కాను. మీకు కలల్లో కనిపించే వస్తువునూ కాను. నేను ఒక స్త్రీని. మీరు నన్ను కోరుకోవాలనుకుంటాను. నన్ను మీ భార్యగా, పుట్టే నా పిల్లలకు తల్లిగా– చూడాలనుకుంటాను.”
వారు విడిపోయారు.
ఆ యువకుడు తన మనసులో “చూడు! ఇంకో స్వప్నం కూడా మంచులా కరిగి పోయింది.” అనుకున్నాడు.
ఆ యువతి “నన్ను పొగమంచు గానూ, ఒక స్వప్నంగానూ చూసే మనిషి గురించి ఏం చెప్పగలను?” అనుకుంది.
Also read: మరణం
Also read: ఇద్దరు వేటగాళ్ళు
Also read: నది
Also read: ఆనందం
Also read: దేవుణ్ణి కనుగొనటం