మంచిర్యాల: ఆదివారం నాడు మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కాసర్ల రంజిత్ కుమార్ తలసేమియా వ్యాధి బాధితుడిని తోటి స్నేహితులు రక్తదానం చేశారు. రంజిత్ రక్తానికి పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అలాగే రంజిత్ కుమార్ ఒక్క తలసేమీయా వ్యాధి బాధితుడిగా ఉండి అదే వ్యాధిగ్రస్తుల కోసం అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి తోటి వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాని కాపాడుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తించిన మిత్రులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రంజిత్ కుమార్ పిలుపు మేరకు 10 మంది స్నేహితులు రక్తదానం చేశారు.
Also Read : కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ
కాసర్ల రంజిత్ కుమార్ సేవలు భేష్
ఈ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి గారు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కాసర్ల రంజిత్ కుమార్ సేవలను కొనియాడారు. రక్తదానం చేసిన యువకులను అభినందించి వారికి ప్రశంసా పత్రం అందజేశారు. కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్నందున రక్తదాతలు ఎవ్వరూ ముందుకు రాక రక్తనిల్వలు లేక తలసేమియా పిల్లలు మృత్యుతో పోరాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. యువకులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి తలసేమియా సికిల్ సెల్ పిల్లల ప్రాణాలను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, చిర్ల సాయినాథ్, చిర్ల రాజు, కంది సాయి, జీ. సాయి కుమార్, వెంకటేష్, ప్రదీప్, దూమని శివసాయి రామ్, పోలు వార్షిత్,కొక్కెర శ్రీకాంత్,తోగారి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ