- శైలేందర్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణ
- టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారన్న శైలేందర్ వర్గం
- ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గన్ ఫౌండ్రీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు బీజేపీ కార్యాలయం వేదికైంది. శైలేందర్ యాదవ్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తన భార్య డాక్టర్ సురేఖ తరఫున బీ ఫారం తీసుకునేందుకు ఓంప్రకాశ్ బీజేపీ కార్యాలయానికి రాగా, శైలేందర్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓంప్రకాశ్ కు టికెట్ ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలు విసిరేంత వరకు వెళ్లింది. ప్రత్యర్థులు ఓంప్రకాశ్ పై పిడిగుద్దులు కురిపించి ఆయన చొక్కా చించేశారు. ఎంఎల్ఏ రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
గన్ ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్ పై దాడికి శైలేందర్ యాదవ్ వర్గీయులు ప్రయత్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , లక్ష్మణ్ లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గా రాజసింగ్ పై కిషన్ రెడ్డి , లక్ష్మణ్ కక్ష కట్టారనా గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ ఆరోపించారు.