- బీజేపీతో నే సామాజిక న్యాయం
- కాంగ్రెస్. బీఆరెస్ లపై మోదీ ఆగ్రహం
- తెలుగు లో ప్రసంగించి ఆకట్టుకున్న మోదీ
- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
- ఈ ఖరీఫ్ లో 20 లక్షలు బాయిల్డ్ రైస్ కొన్నాం
- నిర్మల్. తుఫ్రాన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడి గాలి పర్యటన
ఈ నెల 30న పోలింగ్ జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ మొదటి సారి అధికారం చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్. తుఫ్రాన్ లో బీజేపీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, తెలంగాణ ఓటర్లు బీజేపీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మోదీ ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్. బీఆరెస్ లు అవినీతి సొమ్ము అనే వ్యాధులతో సతమత మవుతున్నాయియని అయన ఏద్దేవా చేసారు. ఇలాంటి అవినీతి రోగాలు ఉన్న కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజానికి కూడా రోగాలు అంటుకుంటాయని ఆయన హెచ్చరించారు. ఏలాంటి అవినీతి రోగాలు లేని పార్టీ బీజేపీ అని అయన స్పష్టం చేసారు. దేశంలో కాంగ్రెస్, తెలంగాణ లో బీఆరెస్ లను నమ్మవద్దని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు చూపిస్తూ వేలకోట్లు దండుకున్నారనీ, ఇలాంటి చర్యలు ప్రమాదానికి సంకేతాలు అంటూ ఆయన నిప్పులు చేరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం చూస్తే ఓటమి భయం పట్టుకుందన్నారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మోదీ డిమాండ్ చేసారు. అయితే గజ్వేల్. కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓటమి చెందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రాజెక్టుల పేరు చెప్పి రైతులన్ని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ దే నని ఆయన దుయ్యబట్టారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించాడు. గత పది సంవత్సరాలుగా సచివాలయం చూడని కేసీఆర్ ప్రజల బాగోలు ఏలా చూస్తారని అయన నిలదీశారు.