- కేంద్రంలో మద్దత్తు మీకే అంటున్న టీడీపీ
- ఏపీ సంగతి ఏంటి అంటున్న బీజేపీ
- బీజేపీ తో సయోధ్య కుదిరితే మైనార్టీలు దూరం అంటున్న టీడీపీ
- 8 పార్లమెంట్ సీట్లు అడుగుతున్న బీజేపీ
- 5 సీట్లు ఇస్తామంటున్న టీడీపీ
- కుదరదు అంటున్న బీజేపీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పునరేకీ కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో టీడీపీ బీజేపీ తో జతకడితే మైనార్టీలు టీడీపీకి దూరం అవుతారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెల్సింది. ఏపీలో మైనారిటీలు ఓట్లు కావాలని టీడీపీ యోచిస్తోంది. అందుకు టీడీపీ ఎన్నికల ఎత్తులకు తెరతీసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన పార్టీ టీడీపీతో జతకట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకు బీజేపీ జాతీయ నాయకులను ఒప్పించడానికి పురుందేశ్వరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇన్నాళ్లు టీడీపీ, జసేన పార్టీలు ఉమ్మడిగా ఏపీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయానికి వచ్చాయి. తాజాగా తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఏపీలో రాజకీయ అలజడి మొదలు అయింది. తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్ తో జాతకట్టిన టీడీపీ అతి విశ్వాసం ప్రదర్శించ బోతోతున్నది. ఎలాగైనా ఏపీలో టీడీపీ అధికారం చేపట్టాలని చంద్రబాబు పొత్తులకు సై అంటున్నారు. మూడు రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. దీంతో 2024లో బీజేపీదే గెలుపు అంటున్నారు. కేంద్రంలో బీజేపీతో సయోధ్య అంటూనే ఏపీలో మాత్రం బీజేపీతో దూరం అంటూ టీడీపీ మెలిక పెట్టింది. టీడీపీ సూచనలు మోసపూరితంగా వున్నాయని బీజేపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. తెలంగాణలో తమకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటోంది. ఏపీలో టీడీపీతో జాతకట్టితే లాభమా లేక నష్టమా అన్న యోచనలో బీజేపీ పరిశీలించ నున్నది.