Sunday, December 22, 2024

టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తూ బీజేపీ చార్జిషీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఛార్జిషీట్ ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మేయర్ కావాలో, ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని జవదేకర్ ధీమా వ్యకం చేశారు.

ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ జమానా అరవై తప్పుల ఖజానా

ఆరేళ్ల టీఆర్ఎస్ పాలన తప్పుల తడకగా మారిందని ఛార్జిషీట్ లో తెలిపారు. దేశంలో అన్ని స్థాయిల్లో పార్లమెంట్‌, శాసనసభ, జిల్లా , మండల, గ్రామ పంచాయతీలు, నగర పాలక మండళ్లకు జరుగుతున్న ఎన్నికలు ఐదు సంవత్సరాల కొకసారి అని జవదేకర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా విడుదల చే సిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిందేనని హెచ్చరించారు. ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలను  నెరవేర్చలేకపోయారని జవదేకర్ అన్నారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న జవదేకర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ కోల్పోయిందని అన్నారు.  

67 వేల కోట్లకు లెక్కుందా?

హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కోసం ఆరేళ్లలో 67,000 కోట్లు ఖర్చు చేసినట్లు  మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. హైదరాబాద్ లో అంత గొప్పగా అభివృద్ధి జరిగితే చిన్న పాటి వర్షాలకే కాలనీలు ఎందుకు నీట మునిగిపోతున్నాయని జవదేకర్ ప్రశ్నించారు. వందలాది కాలను నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ట్రాఫిక్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతోందన్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జవదేకర్ అన్నారు. రోడ్ల మీదనే డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 67 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు చెబుతున్న కేసీఆర్ చెయ్యని పనులను చేసినట్లు మాయ మాటలు చెబుతూ హైదరాబాద్​ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లంటే 1100 గృహప్రవేశాలా

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇళ్లు లేని నిరు పేదలకు లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తా మన్న హామీని కేసీఆర్ గాలికొదిలేశారని జవదేకర్ అన్నారు. ఇంతవరకు ఎన్ని ఇళ్లు కట్టారు. ఎక్కడున్నాయే లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని నిరు పేద కుటుం బాలు గృహ ప్రవేశాలు జరుపుకున్నాయే వివరాలు ప్రజలకు సమర్పించాలన్నారు.  అసెంబ్లీలో సవాలు ప్రతిసవాలు చేసిన మీ మంత్రి తలసాని డబుల్​ బెడ్రూం ఇళ్లను చూపించకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలొస్తున్నాయని దసరా రోజున హడావుడిగా 11 వందల మంది నిరు పేదలకు ఇళ్లను కేటాయించారని అన్నారు. కేసీఆర్ చెప్పిన లక్ష ఇళ్లకు కట్టిన ఇండ్ల సంఖ్యకు పొంతన లేదని ఆక్షేపించారు. నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కట్టామంటే ముగ్గు పోసి వదిలేస్తే ఇళ్లు కట్టేనట్టేనా అని విమర్శలు కురిపించారు.  2015లో జీతాలు పెం చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేసిన దాదాపు ఇరవై వేల మంది జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికులకు డబుల్​ బెడ్రూం ఇళ్లను ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎంతవరకు వచ్చిందని జవదేకర్ ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరాన్ని డల్లాస్‌‌గా, ఇస్తాం బుల్​గా మారుస్తాం

హైదరాబాద్ నగరాన్ని డల్లాస్‌‌గా, ఇస్తాం బుల్​గా మారుస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోలేదని అన్నారు జవదేకర్. స్కై స్క్రాపర్లు, సిటీ చుట్టూ గ్రీన్ కారిడార్, వేగంగా దూసుకుపోయే స్కైవేలు, సిటీ శివార్లలో శాటిలైట్ టౌన్ షిప్పులు, ఇక వరల్డ్ క్లాస్ సిటీ అంటేనే హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అవుతుందంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన జోక్ గా మారిపోయిందన్నారు. వరదలొచ్చి నెల రోజులైనా బురద వీడని కాలనీలను చూస్తే అర్ధమవుతుందన్నారు. నాలుగు వందల ఏళ్ల చారిత్రక ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని ఇస్తాం బుల్ తరహా మెరు గులు దిద్దుతామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు.  ప్రజలు టీఆర్​ఎస్ నేతలను నిలదీస్తే డల్లాస్, ఇస్తాంబుల్ లో కూడా వానలు పడతాయని వెటకారంగా మాట్లాడుతున్నారని జవదేకర్ విమర్శించారు. డల్లాస్ లో వరదలొచ్చినా కాలనీలు మునిగిపోకుం డా జనం కొట్టుకుపోకుండా మెరుగైనమౌలిక సదుపాయాలు  ఉంటాయని టీఆర్ఎస్ నేతలకు తెలియదా అని జవదేకర్ ఎద్దేవా చేశారు.

వంద గప్పాల ప్లాన్ ఏమైంది

జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వంద రోజుల్లో నగర రూపు రేఖలను మారుస్తామని మంత్రి కేటీఆర్‌ 2016 ఎన్నికలప్పుడు గొప్పలు చెప్పారని జవదేకర అన్నారు. ఐదేళ్ల గ్రేటర్‌ పాలనలో మున్సిపల్‌ మంత్రి, జీహెచ్‌‌ఎంసీ పాలకవర్గం ఈ హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వంద రోజుల ప్రణాళిక మాట దేవుడెరుగు. కానీ గతుకుల రోడ్లను కూడా బాగుచేయలేకపోయిన అసమర్థత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది . 150 మంది కార్పొరేటర్లు ఉన్నా కార్పొరేష న్ లో 146 మందిని మీ గుప్పిట్లోనే పెట్టుకున్న మీకు హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డుపడ్డారో చెప్పాలని జవదేకర్ ప్రశ్నించారు.

bjp releases chargesheet against trs failures

మూసీ రివర్ ఫ్రంట్ అందాలేవీ

మూసీ కంపు పోవాలంటే తమకు ఓటేయాలని 2016 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీఆర్​ఎస్ గెలిచిన తర్వాత ఏం చేసింది.  మూసీ రివర్ డెవలప్ మెం ట్ కార్పొరేష న్ ఏర్పాటు చేసి దానికో ఛైర్మన్ ను ని యమించింది. గుజరాత్ లోని సబర్మతి రివర్​ ఫ్రంట్ లాగా మూసీ నదిని  ప్రక్షాళన చేస్తామని అందంగా మెరుగులు దిద్దుతామని ప్రకటించింది. 2017లో మున్సిపల్​ మంత్రి కేటీఆర్​, మేయర్​ బొంతు రామ్మోహన్ కలిసి సబర్మతి రివర్ టూర్ కు వెళ్లి అక్కడి అభివృద్ధిని చూసి వచ్చారు. ప్రజాధనంతో టూర్​లకు వెళ్లిన నేతలకు మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, ఇంటర్వ్ నేషన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కుల అభివృద్ధిని ఎందుకు మరిచిపోయారని జవదేకర్ ప్రశ్నించారు.  2014లో ఈ ప్రాజెక్టు కోసం 1400 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఎందుకు ఆపేశారని అన్నారు.

2016 గుర్తుకు లేదా

వరదలు వచ్చినప్పుడే సిటీలో కబ్జాలకు గురైన చెరువులు, ఆక్రమణలకు గురైన నాలాలు, డ్రైనేజీలు గుర్తుకు వస్తాయా? 2016లో నిజాంపేట ఏరియాలోని భండారీ లేఅవుట్ కాలనీలన్నీ వరద నీటిలో మునిగిన సమయంలో సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలు ఎందుకు అమలు కాలేదు. ఆక్రమణలు ఎందుకు తొలిగించలేదు. డ్రైనేజీలు ఎందుకు విస్తరిం చలేదు. నాలుగేళ్ల తర్వాత డిసెంబర్​లో కురిసిన భారీ వర్షాలతో సిటీలో వందలాది కాలనీలు నీట మునిగి పోయాయి. వరదల్లో జనం ముప్ప తిప్పలు పడితే సీ ఎం ప్రగతిభవన్ గడప దాటలేదు.  సీ ఎం చెప్పిన మాటల్ని మళ్లీ మంత్రి కేటీఆర్​ వల్లించటం తప్ప ప్రభుత్వానికి యాక్షన్ ప్లా న్ అంటూ ఏమీ లేదని జవదేకర్ విమర్శించారు.

ఇంటింటికి 10 వేలు ఎవరి జేబులోకి

వరదలతో మునిగిన ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం లబ్ధిదారులకు దక్కలేదని అన్నారు. ఇంటింటి కీ 10 వేల నగదు ఇవ్వాలనే మీ ఆలోచన వెనుక ఎవరి చేతివాటముందని ప్రశ్నించారు. గ్రేటర్​ ఎన్నికలకు ముం దు మీరు పంచిన 650 కోట్ల ప్రజాధనం టీఆర్​ఎస్ నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు తమ జేబులు నింపుకున్నట్లు ఆరోపణలొచ్చాయని అన్నారు. నిజంగానే వరద బాధితులకు ఈ డబ్బులు పంపిణీ చేస్తే, మూడు రోజుల పాటు లక్షలాది బాధితులు సిటీలోని మీ సేవా కేం ద్రాల వద్ద  ఎందుకు బారులు తీరారు. ఎన్నికలప్పుడు  ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన టీఆర్‌ ఎస్‌‌ నాయకులు ప్రజలు నడుము ల్లోతు నీళ్లల్లో నరక యాతన పడితే ఎందుకు ముఖం చాటేశారని జవదేకర్ అన్నారు.

ఆస్తి పన్ను ఓ డ్రామా

గ్రేటర్​ ఎన్నికలకు పది రోజుల ముం దు జీహెచ్ ఎంసీ పరిధిలో 15 వేల లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పటం విడ్డూ రంగా ఉంది. 2016 ఎన్నికలకు ముం దు కూడా టీఆర్​ఎస్ ప్రభుత్వం ఆస్తి పన్నుపై నజారానా ఇచ్చి మోసం చేసిన సంగతిని హైదరాబాద్ ప్రజానీకం మరిచిపోలేదన్నారు జవదేకర్.  1200 ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారంతా 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుం దని అప్పుడు ప్రకటించింది . దాదాపు అయిదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఎన్నికల్లో ఓట్లు మళ్లించుకుంది . ఎన్నికలయ్యాక నిజస్వరూపం బయటపడింది. ఎన్నికల ముం దు లబ్ధి పొందిన వారందరి ఇళ్లపై విజిలెన్స్​ ఇన్ స్పెక్షన్ చేయిం చి ఆస్తి పన్ను సవరణ పేరుతో రెండు మూడు రెట్టు ఎక్కువ వసూలు చేశారని అన్నారు. దాదాపు రెండు లక్షల మందిపై ప్రభుత్వం భారం మోపిందని అన్నారు. ఇప్పుడు ప్రకటించిన సగం రాయితీ.. ఎన్నికల తర్వాత ఆస్తి పన్నును మళ్లీ పెంచేందుకే నని అన్నారు.

రోడ్లంటే రిబ్బన్కటింగ్ లా?

నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 20 వేల కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ రోడ్ డెవల్మెం ట్ ప్లాన్ అందుబాటులోకి తెస్తామన్నారు. 20 ఫ్లై ఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 60 ప్రధాన రోడ్లు 50 గ్రేడ్ సె పరేటర్లు తో మొత్తంగా 2 వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రతిపాదించిన వాటిలో కనీసం 25 శాతం కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేం దుకు మూసిపై 42 కిలోమీటర్ల మేర 6 లేన్ల రోడ్ ను నిర్మిస్తామన్నారు. ఐదేళ్లయినా పనులు మొదలు కాలేదు. హైదరాబాద్‌‌ నగరంలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ రెండేళ్లలో అమలు చేస్తామని ఘనంగా చెప్పారు. ఇప్పటికీ సిగ్నళ్లు మొరాయిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రధాన రోడ్లు వైట్ టాప్ రోడ్లుగా మారుస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఈ పనులు చేపడతామన్నా ఇంతవరకూ ఒక్క వైట్ టాప్ రోడ్డు కూడా వేయలేదు.

హుస్సేన్ సాగర్ లోకి కొబ్బరి నీళ్లెపుడు

కంపుకొట్టే హుస్సే న్ సాగర్ లో మురుగు నీటిని తోడి మంచినీళ్లతో నింపుతామన్న మాట నిజం కాదా? 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హుస్సే న్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలతో సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లను చేస్తామన్న సీ ఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారని జవదేకర్ ఎద్దేవా చేశారు. హుస్సే న్ సాగర్ నాలాలోకి మురుగు నీరు చేరకుండా కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఇంటర్ సెప్షన్ అండ్ డైవర్షన్ నిర్మా ణ పనులు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. కాంట్రాక్టర్లు లబ్ధిపొందేందుకు  ఏటా హుస్సే న్ సాగర్ క్లీనిం గ్ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారు. జరిగిన అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది, పది నిమి షాలు ముక్కు మూసుకోకుండా టాంక్ బండ్ మీద నిలబడతారా? బ్యూటి ఫికేషన్ పేరిట చేసిన పనులే చేస్తూ, కాం ట్రాక్టర్ జేబులు నింపుతున్నారని విమర్శించారు.

మెట్రో రైలు ఓల్డ్ సిటీ వరకు ఎందుకు పోలేదు

ఉమ్మడి రాష్ట్రం లో పునాది పడిన మె ట్రో రైల్ నిర్మాణాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వమే దగ్గరు డి కట్టిం చినట్లుగా చెప్పుకుంటోందని అన్నారు. 17,290 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి కేటీఆర్, ఓల్డ్ సిటీ వరకు మె ట్రో లైన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు ఏడాది లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏడాదైన పనులు ఎందుకు మొదలుపెట్టలేదన్నారు. ఇక ఎయిర్ పోర్టు వరకు మెట్రోలో జర్నీ చేసే విధంగా లైన్ వేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యా యి అని ప్రశ్నలు సంధించారు.

సాగర్ టవర్లు ఎంత ఎత్తుకో !

హుస్సేన్‌‌ సాగర్‌ చుట్టూ 60 నుం చి 100 అడుగుల ఎత్తైన భారీ లేక్‌‌ వ్యూ టవర్స్‌‌ నిర్మిస్తా మని 2014లోనే సీ ఎం కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. దుబాయ్ లోని బుర్జ్​ ఖలీఫా, కౌలాలంపూర్‌ లోని పెట్రోనాస్‌‌ టవర్స్‌‌, ముంబయి సముద్ర తీరంలోని టవర్స్‌‌ మాదిరిగా హుస్సేన్‌‌ సాగర్‌ చుట్టూ భారీ ఆకాశ హర్మ్యాలను నిర్మిం చనున్నట్టు ప్రకటించారు. విలాస వంతమైన టవర్స్‌‌తో నగర ఖ్యాతి పెరుగు తుందని గొప్పలు పోయారు. బోట్స్‌‌క్లబ్‌ , నెక్లెస్‌‌రోడ్‌, జలవిహార్‌ , అంబేద్కర్‌ నగర్‌ , సంజీవయ్య పార్క్‌‌, సికిం ద్రాబాద్‌ బోట్స్‌‌ క్లబ్‌ , మారియట్‌‌ హోటల్‌ , డీబీఆర్‌ మిల్స్‌‌, లోయర్‌ ట్యాంక్‌‌బండ్‌‌, సెక్రటేరియట్‌‌లోని ప్రాంతాల్లో ఇండిపెండెంట్‌‌ టవర్లు నిర్మిం చాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరేళ్లు గడిచినా టవర్స్​ ఊసెత్తడంలేదని ఎద్దేవా చేశారు.

విశ్వనగరమంటే విధ్వంసమా?

హైదరాబాద్‌ ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం  400 ఏళ్ల నగర చరిత్రకు సాక్షిగా ఉన్న నిర్మా ణాలను  కూల్చేస్తున్నారని అన్నారు. సెక్రటేరియట్‌‌లోని హెరిటేజ్‌ బిల్డింగ్‌‌ సహా అమ్మవారి ఆలయం, మసీదులను నేలమట్టం చేశారు. వాటి శిథిలాలపై కొత్త సె క్రటేరియట్‌‌ను నిర్మి స్తున్నారు . చారిత్రక అసెంబ్లీ, ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌‌, ఉస్మానియా హాస్పిటల్‌ ను కూల్చేం దుకు సిద్ధపడ్డారు . ఉస్మానియా హెరిటేజ్‌ బిల్డింగ్‌‌ను చారిత్రక సాక్ష్యంగా కాపాడి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బిల్డింగ్‌‌ కట్టే అవకాశమున్నా పాత భవనాన్ని కూల్చడానికే మొగ్గు చూపుతున్నారని అన్నారు.  హైకోర్టు అడ్డుకోకుం టే ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌‌ నేలమట్టమయ్యేది. అసెంబ్లీ బిల్డింగ్‌‌ను చరిత్రలో కలిపేయాలని సీఎం ఎప్పటి నుం చో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ శ్రేణి నగరమంటే ఉన్న చరిత్రను నేలమట్టం చేయడమా అని జవదేకర్ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు.

విజన్ లేని రిజర్వాయర్లు, కనెక్షన్లు లేని నల్లాలు

నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కృష్ణా, గోదావరి నీళ్లను నిల్వ చేసుకునేలా రాచకొండ, శామీర్ పేట వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. డీపీఆర్‌ లు కూడా రె డీ అయ్యాయి. అయిదేళ్లయినా రెండు రిజర్వాయర్ల కోసం తట్టెడు మట్టి తియ్యలేకపోయారన్నారు. ఉమ్మడి పాలకుల హయాం లో చేపట్టిన కృష్ణా, గోదావరి డ్రింకింగ్‌‌ వాటర్‌ స్కీంలతోనే ఇప్పటికీ గ్రేటర్‌ ప్రజల గొంతులు తడుస్తున్నాయి. కాళేశ్వరం నుంచి లక్ష కోట్లతో తన సొం త ఫామ్ హౌజ్​ సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్​ వరకు నీళ్లను లిఫ్ట్ చేసిన సీఎం, హైదరాబాద్ సంగతి మరిచిపోయారు. ఎన్నికల ముందు 32 వేల కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తామన్నారు. పేదలకు ఒక రూపాయికే నల్లా కనెక్షన్ అని ప్రకటించారు. ఇప్పటికీ నల్లాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 25 శాతం మందికే కనెక్షన్ ఇచ్చారు.

ఉద్యోగాల టాస్క్ ఉత్తదేనా

తెలంగాణ వచ్చాక టీఎస్ పీఎస్ సీ ద్వారా ఎన్నెన్ని  నియామకాలు చేపట్టారో ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చే యాలి? 18 వేల మంది కాం ట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ని ర్ణయం తీసుకున్నదని జీహెచ్ ఎంసీ మేనిఫెస్టో లో పెట్టి, ఆ తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వా రా 4 ఏళ్ళలో సుశిక్షుతులైన లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న  హామీ ఎక్కడికి ఏమయిందని జవదేకర్ ప్రశ్నించారు.

గ్రేటర్ పైనా అప్పులు తెచ్చుడేనా

అప్పులతో రాష్ట్ర ఖజానాపై పెను భారం మోపిన టీఆర్ఎస్ ప్రభుత్వం, జీహెచ్ ఎంసీని కూడా అప్పుల ఊబిలోకి లాగుతోందని అన్నారు. ఎస్ ఆర్​డీపీతో పాటు సిటీ డెవెలప్ మెంట్ పేరిట భారీగా అప్పులు తెస్తోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచిం గ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుం డా పెండింగ్ లో  పెడితే.. సిటీలో అభివృద్ధి.. మౌలిక వసతులెలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దౌర్భా గ్య స్థితి లో టీఆర్ఎష్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

జీహెచ్ఎంసీకి డబ్బులివ్వలే

నగర ప్రజలకు వరదల నుంచి విముక్తి కల్పించే సీవరేజీ మాస్టర్‌‌ ప్లాన్‌‌  10 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశమున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం  దానిని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్రించారు. రాష్ట్రంలోని అన్ని ము న్సిపాలిటీలకు కేం ద్రం నుండి వస్తున్న 1030 కోట్ల నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 1030 కోట్లను విడుదల చే స్తామని చట్టం చేసి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చే యలేదు. కార్పొరేటర్‌‌ డెవలప్‌‌మెంట్‌ ఫండ్‌‌ కిం ద యేటా 450 కోట్లు విడుదల చేయకుం డా వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆరోపించారు. నగరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వంద కోట్ల రూపాయల సహాయం చే స్తామన్నారు.. ఇప్పటివరకు కేవలం 25 కోట్ల రూపాయల మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

మోడల్ మార్కెట్లు కనిపించడంలేదు

గ్రేటర్ పరిధిలో మొదటి దశలో 130 కోట్లతో 40 మోడల్ మార్కె ట్లు, 200 ఆదర్శ మార్కెట్లు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ స్వయంగా మోండా మార్కెట్‌‌ను సందర్శించి రెండంతస్తుల మార్కె ట్లను అందుబాటులోకి తెస్తామని గొప్పగా చెప్పారు . కేవలం నాలుగు మార్కెట్లు మాత్రమే నిర్మించినా వాటిని అందుబాటులోకి తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.

చెత్త డంపింగ్ ఎక్కడ?

స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నగరంలో 200 నుండి 300  ఎకరాల వరకు 15 కొత్త చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త డంప్  యార్డును కూడా ఏర్పాటు చేయలేదు. నగరంలో కోటి రూపాయల ఖర్చుతో అన్ని హంగులతో 36 శ్మశాన వాటికలను నిర్మిస్తామన్నారు.  ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు. నగరంలో అన్ని కాలనీలలో కొత్త పార్క్ ల  ఏర్పాటుకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. జీహెచ్ ఎంసీ వసూలు చేస్తున్న లైబ్రెరీ సెస్సుకు అనుగుణంగా సిటీలో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. నామమాత్రంగా ఒకటి రెండు తప్ప కొత్త గ్రం ధాలయాలను ఏర్పాటు చేయలేదు.

ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎందుకాగింది?

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ రెండో దశ  ఎందుకు ఆగిపోయింది , కేంద్రం నిధులు కేటాయిస్తామని చెప్పినా, రాష్ట్రం తన   వాటా నిధులను విడుదల చేయలేదు. ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్, మెట్రో లైన్ విస్తరణ ఆగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం  నిధులు కేటాయించలేకపోవడం అసలు కారణం కాదా అని విమర్శించారు. పెరుగుతున్న డిమాం డ్ కు తగ్గట్టుగా నగర ప్రయాణికులకు కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని జీహెచ్ ఎంసీ  ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.

జాడలేని ఆడిటోరియం

ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల నిర్వహణకు గాను 4 పెద్ద ఆడిటోరియంలను నిర్మిస్తా మన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆడిటోరియం  నిర్మా ణం కూడా ప్రారంభం కాలేదన్నారు. రవీంద్ర భారతి ఆడిటోరియం ఆధునికీకరణ చేస్తామన్నారు. గత ఎన్నికల హమీల అమలు కు ప్రతి ఏరియాలో టౌన్ హల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని జవదేకర్ దుయ్యబట్టారు.

ట్రాక్ వెతుకుతున్న సైకిళ్లు

అవుటర్ రిం గ్ రోడ్డుపై సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామనే హామీ ఇంకా ప్రతిపాద దశలోనే ఉన్నది. నగరంలో 25 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చే స్తామన్నారు.. ఇందులో భాగంగా హైటెక్స్ వద్ద మాత్రమే ఏర్పాటు చేశారు, అది కూడా వాడుకలో లేదు. సిటి అంతటా ఫ్రీ వైఫై అందుబాటులోకి తెస్తామన్నారు. నగరంలో కేవలం నెక్లెస్ రోడ్డు లో అందుబాటులోకి తెచ్చినప్పటికీ,  సరైన ని ర్వహణ లేకపోవటంతో అది కూడా మూలన పడిందన్నారు.

పేద, మధ్యతరగతికి శాపం ఎల్ఆర్ఎస్

కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి చిన్నచిన్న వ్యా పారాలు మూతపడటంతో వందల సంఖ్యలో కుటుంబాలు రోడ్డునపడ్డాయని జవదేకర్ అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ పేరుతో ఒక్కో ప్లా ట్ యజమాని వద్ద 50 వేల నుం చి 2 లక్షల వరకు వసూలు చేసేందుకు సర్కార్ సిద్ధం కావడం  శోచనీయమన్నారు. ఎల్ఆర్​ఎస్ కోసం వచ్చిన 25 లక్షల దరఖాస్తుదారుల నుం చి 20 వేల కోట్లు రాబట్టా లనే దురాలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ర్టం ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు.  ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రెండున్నర నెలల నుం చి రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయన్నారు. నగరంలో లక్షకు పైగా పేద కుటుంబాలు ఎల్​ఆర్​ఎస్ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నాయన్నారు.

కరోనాపై చేతులెత్తేసిన ప్రభుత్వం

కరోనా టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడిందన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు టెస్టింగ్‌, ట్రీట్ మెంట్ ల పై దృష్టిపెడితే తెలంగాణ సర్కారు కరోనా పేషంట్లను గాలికొదిలేసింది.  వైరస్‌ కేసులు మొదలైన కొత్తలో గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో చేస్తున్నామని గొప్పలకుపోయిన సీఎం వైరస్‌ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు. వైరస్‌ ఉధృతిని తక్కువ చేసి చూపడానికి కేసులు, కరోనా మరణాలను దాచిపెట్టారని ఆరోపించారు. హైకోర్టు జోక్యం చేసుకొని మొట్టికాయలు వేస్తే తప్ప టెస్టుల సంఖ్యను పెంచలేదు. జనం చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. గ్రేటర్ పరిధిలో రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు వేల మంది చనిపోయారు. సర్కారు హాస్పిటళ్లకు వెళితే ప్రాణాలకు గ్యారంటీ లేదని, స్వయంగా బాధితులు సెల్ఫీ వీడియోలు పెట్టింది ని జం కాదా అని సీఎంను ప్రశ్నించారు. గ్రేటర్​లో కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎంతో పాటు నేతలు ప్రగతిభవన్ దాటి బయటికి రాలేదన్నారు.

సింగిల్ ఫ్యామిలీ కోసమేనా తెలంగాణ

ఆరు దశాబ్దాల పోరాటం, వేలాది మంది బలిదానాలతో  తెలంగాణను సాధించుకున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ బాగు కోసమేనా? పార్టీ జెండా మోసి, ఉద్యమంలో కేసులు, కొట్లాటలతో కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్న తెలంగాణ అభిమానుల కంటే రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లే ఎక్కువయ్యారా అని ప్రశ్నించారు. కొడుకు, కూతురు, అల్లుడు, మీ బంధుగణానికే ఎంపీలు, మంత్రులు,  ఎమ్మెల్సీ పదవులా అని జవదేకర్ సీఎంను ప్రశ్నించారు.  తెలంగాణలో ఏ పని కావాలన్నాప్రగతిభవన్  గోడల చాటునే జరుగుతుందనే ప్రచారం నిజం కాదా అన్నారు. డివిజన్ లో అభివృద్ధి పనులు చేయలేక, ఎన్నుకున్న ఓటర్లకు న్యాయం చేయలేక పోటీ నుంచి తప్పుకుంటున్నా మని స్వయంగా కార్పొరేటర్లు చెప్పిన మాట నిజం కాదా? పోలీసు తూటాలకు లాఠీదెబ్బలకు ఎదురు నిలిచి పోరాడింది ఒక్క కుటుంబానికి లాభం చేకూర్చడానికేనా అని జవదేకర్ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న యువకుల ఆశ నెరవేరలేదు. స్వయం పాలనలోనూ నెర్రెలు బారిన బీడు భూముల్లోకి కృష్ణా, గోదావరి నదులు పరుగులు పెట్టలేదు. వేలాది మంది ప్రాణాలర్పించి సాధించిన తెలంగాణ కేసీఆర్ గుత్తాధిపత్యం లో విలవిల్లాడుతోందని ఆరోపించారు.  కుటుంబ సభ్యులందరూ పదవులతో తులతూగుతుంటే తెలంగాణ బడుగుజీవి ఆకలితో అలమటిస్తూనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లేవి?

హైదరాబాద్‌ నగరానికి నలుగు దిక్కు లా నిమ్స్‌ తరహాలో నాలుగు సూపర్‌ స్పె షాలిటీ హాస్పిటళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నగరంలోని నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై భారం తగ్గించేందుకు జిల్లాల నుం చి వచ్చే ప్రజలకు సత్వరం వైద్యం అందించేం దుకు ఈ హాస్పిటళ్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఈ హాస్పిటళ్ల గురించే ప్రస్తావిం చారు. ఐదేళ్లు గడిచినా ఒక్క హాస్పిటల్‌ కూడా కట్టలేదు. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ ను టిమ్స్ గా మార్చినా అందులో కొందరు కోవిడ్‌ రోగులను మాత్రమే చేర్చుకుంటున్నారు . ఉస్మానియా హాస్పిటల్‌ను కూల్చేయడానికి సిద్ధపడ్డారు. గాంధీ కరోనా ట్రీట్ మెం ట్ కు పరిమితం కాగా, ని మ్స్ లో పేద, నిరు పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో పేదలకు సర్కారీ వైద్యం అందడం లేదని వాపోయారు.

లక్ష కోట్ల అవినీతి

రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కుటుంబం ఆరేళ్లలో లక్ష కోట్ల ప్రజల సొమ్మును కమీషన్ల రూపంలో దోచుకుందని జవదేకర్ ఆరోపించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్మును దోచిపెడుతూ భారీగా దండుకుంటోంది. ఇంటింటికీ నల్లా నీళ్లు అని మొదలు పెట్టిన మిషన్‌ భగీరథ స్కీం ప్రతిపాదనల్లోనే అంతులేని అవినీతి ఉందని అన్నారు. పైపుల కంపెనీలకు లాభం చేకూర్చడానికే ఈ స్కీంను డిజైన్‌ చేసినట్లు తెలిపారు. కరెంట్‌ కొనుగోళ్ల చీకటి ఒప్పందాలు, భూదందాల్లో ప్రభుత్వ పెద్దల కీలక పాత్రఉందని ఆరోపించారు. కమిషన్‌ లకు కక్కుర్తి పడి నాసిరకం పనులను చేపట్టేవారని అన్నారు. నగరంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణంలో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కరోనా టైమ్ లో రోడ్లకు పైపై పూతలు పూసి కోట్ల రూపాయల బిల్లులు ఎవరికి చెల్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పైన పటారం లోన లొటారం

ఉత్తుత్తి హామీలు, పైపై మెరు గులు కా దు. విశ్వ నగరమంటే ప్రపంచ స్థాయి సదుపాయాలుండాలి. విశాలమైన రోడ్లు, ట్రాఫిక్‌ రద్దీ లేని రవాణా, అద్భు తమైన డ్రెయినేజీ వ్యవస్థ, సిటీ లైఫ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలి. కానీ కోటి మందికిపైగా ప్రజలు నివసించే హైదరాబాద్ లో కనీస సౌకర్యాలు కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.

  • నగర పాలన పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలని  శాసనాలు, నిబంధనలు, నిర్ణీత విధానాలు చేయడానికి నిపుణుల కమిటీ వేస్తా మన్నారు. కొత్త నిపుణుల కమిటీ వేయకపోగా పాత కమిటీలను అపహాస్యం చేస్తున్నారు.
  • సిటిజన్ చార్టర్తో అధికారులు సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేటట్టు చూస్తామన్నారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.
  • జీమెచ్ఎంసీ పరిధిలోని ఆర్&బీ రోడ్లను 337 కోట్ల రూపాయలతో 1800 కి.మీలు మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికీ చేసిందేమీ లేదు.
  • హైదరాబాద్లో విద్యు త్ అంతరాయం కలగకుండా సబ్ స్టేషన్ల నిర్మాణానికి, ఆధునీకరణకు రూ.1920 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. అమలుకు నోచుకోలేదు.
  • సంప్రదాయేతర ఇంధన ప్రోత్సాహం కోసం సౌర విద్యు త్ కు సబ్సిడీ ఇస్తా మన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని తమ ఖాతాలో చెప్పుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు.
  • హైదరాబాద్లో వెయ్యి చెత్త ట్రాలీలు 5 సంవత్సరాలు క్రితం కొన్నారు. ఇవి ఫ్రీగా ఇవ్వలేదు కానీ కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త వాటిని కొనలేదు.
  • 3500 కి.మీ పొడవైన మురుగునీటి వ్యవస్థను ఆధునీకరిస్తా మన్నారు. నాలాలను పరిరక్షిస్తా మన్నారు. ఇది అమలు కాని కారణంగా మొన్నటి వర్షా లకు హైదరాబాద్ లో రోడ్లన్నీనదులుగా మారాయి.
  • హైదరాబాద్ నగరంలో పర్యా వరణ అనుకూల ఎల్ఈడీ లైట్లను తీసుకొస్తా మన్నారు. దాని ద్వా రా 80 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. ఈ మొత్తం నిధులు కేంద్రం ఇచ్చిందన్న విషయాన్ని మాత్రం మరచిపోయారు.
  • ఒక్కో టి కోటి రూపాయల ఖర్చుతో అన్ని హంగులున్న శ్మశాన వాటికలను నిర్మిస్తామన్నారు. ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు.
  • సిటి అంతటా ఫ్రీ వైఫై అందుబాటులోకి తెస్తా మన్నారు. నగరంలో కేవలం నెక్లెస్ రోడ్డు లో అందుబాటులోకి తెచ్చినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవటంతో అది కూడా మూలన పడింది.
  • హైదరాబాద్ లో ఆర్టీసీ నిర్వహణ బాధ్యతను జీహెచ్ఎంసీ కి అప్పగిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అప్పగిం చలేదు.ఒలిం పిక్స్ వంటి ప్రపంచ శ్రేణి క్రీడాపోటీలు హైదరాబాద్ లో నిర్వహించేలా నగరంలో ఆధునిక స్టేడి యాలు, క్రీడావసతులు ఏర్పాటు చేస్తా మన్నారు. ఉన్న క్రీడా మైదానాలను  వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
  • హరితహారం కార్యక్రమంలో శివారు ప్రాంతంలో 10 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. వెయ్యి కి.మీ పొడవునా కాంపౌండ్ గోను అనుసరించి మొక్కలు నాటే గ్రీన్ కర్టెన్ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ఎన్ని మొక్కలు నాటారో లెక్క మాత్రం లేదు.
  • హైదరాబాద్లో వాయు, నీటి, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఈ దిశగా ఒక్క చర్య కూడా ముందుకు పడలేదు.
  • హైదరాబాద్ లో మహిళల చేత మహిళల కొరకు నడిపే టాక్సీ సర్వీసు లను ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అమలు మాత్రం జరగలేదు.
  • ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకు న్న లక్షా 8వేల పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా మని వాగ్దా నం చేశారు. ఇప్పటివరకు పట్టాల పంపిణీ జరగలేదు.
  • నగరంలో 9.5 లక్షల మంది ఆటోలు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు కల్పించి న దాఖలాలు లేవు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో లక్ష మంది యువతకు శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పి స్తామని లక్ష్యం నిర్ణయిం చారు.
  • కానీ లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో 18వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తా మన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామన్నారు. నిన్న మొన్న ఎన్ని కల ముం దు పెంచినట్టు గా ప్రకటనలు చేస్తున్నారు.
  • హైదరాబాద్లో 1958 తర్వా త ఒక్క హాస్పి టల్ కూడా నిర్మాణం కాలేదు. అందుకోసం ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యా లు కల్పించేందుకు ఆధునిక పరికరాలతో సౌకర్యా లతో 32 వైద్య కేంద్రాలు అభివృద్ధి చేస్తా మన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన వెల్ నెస్ సెంటర్ నిధులతో బస్తీ దవాఖానాల పేరిట హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారు.
  • హైదరాబాదు దశాబ్దా లుగా దాహార్తిని తీర్చి న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు పూర్వవైభవం తెస్తా మన్నారు.కానీ ఆ వాగ్దా నాన్ని మాత్రం అమలు చేయలేదు.
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1000 పర్యా వరణ అనుకూల టాయిలెట్లు ఏర్పాటు చేస్తా మని ప్రణాళికలో ప్రకటించారు. 200 టాయిలెట్లు కూడా నిర్మించలేదు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.
  • టెస్టు ల సంఖ్య తగ్గించి బాధితుల సంఖ్యను తక్కు వగా చూపారు. కరోనా బారిన పడ్డ వారికి సకాలంలో ఉచిత వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రైవేటు వైద్యశాలల దోపిడీకి హైదరాబాద్ నగర ప్రజలు గురయ్యా రు.
  • కరోనా సమయంలో హైదరాబాద్లో ఉన్న లక్షలాది వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి నా వారి ఆకలి బాధలు తీర్చలేదు. పర్యవసానంగా వలస కార్మికు లు స్వస్థలాలకు చేరే ప్రయత్నంలో అష్టకష్టాలు అనుభవించారు. ఇది హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి.
  • జేఎఎన్ ఆర్ఎం కింద గత ప్రభుత్వం నిర్మించి ప్రవేశానికి సిద్ధం గా ఉన్న 20వేల ఇండ్లను కూడా ఎవరికీ కేటాయించక పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చి న సొంతింటి హామీ నెరవేరలేదు. 
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ గృహకల్ప ఇండ్లను తక్కు వ ధరకు ఇస్తామని వాగ్దానం చేసి మాట తప్పా రు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles