సిర్పూర్ కాగజ్ నగర్: తెలంగాణ బాగుపడాలంటే రాష్ట్రంలో బీజేపీ రాజ్యం రావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ రాక సందర్భంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బాబూరావు ఈ కింది వ్యాఖ్యలు చేశారు:
‘‘కొందరు వేసవికాలం రాగానే గంజి తాగించి ఓట్లు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. గంజి కోసం ఆశపడితే మన జీవితాలు బాగుపడవు. తెలంగాణ రాకముందు కేసీఆర్ అనేక వాగ్దానాలు ఇచ్చారు. దీంతో సిర్పూర్ లో ఆంధ్ర వాడైన వ్యక్తిని కూడా గెలిపించాం. అయన హామీలు ఏం నెరవేరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక బహిరంగ సభలలో చేసిన విధంగానే అబద్దాలు చెపోయి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:ఇది కుమ్రం భీం పుట్టిన గడ్డ కేసీఆర్, జాగ్రత్త: తరుణ్ చుగ్ హెచ్చరిక
‘‘ప్రాణహిత చేవెళ్ళ ముందు లాగే ఉంది ఉంటే 16లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉండేది. సిర్పూర్ నియోజకవర్గంను నిండా ముంచింది టిఆర్ ఎస్ పార్టీ. టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదివాసులని మోసం చేసింది. ప్రశ్నించిన బండి సంజయ్ పై దాడి చేసి కేసులో పెట్టారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి మాట తప్పింది టిఆర్ఎస్.
‘‘బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చాక పొడు భూములకు పట్టాలిప్పిస్తాం. మా పార్లమెంట్ నియోజకవర్గం నుండి 7 నియజకవర్గాలను రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపిస్తాం. అప్పుడు నేను ఒక్కడినే ఉండే..సోయం బాపురావ్ గెలవాడు అన్నారు…కానీ గెలిచి చూపించా. ఇప్పుడు బిజెపి కి చాలా బలం వచ్చినట్లయ్యింది. ప్రతి ఊరిలో ప్రజలు జై తెలంగాణ అనేవారు కానీ ఇప్పుడు జై బిజెపి అంటున్నారు.
Also Read: కేసీఆర్ పై సంజయ్ వాగ్బాణాలు
‘‘తెరాస ఇచ్చే కేసీఆర్ కిట్, రేషన్ బియ్యం, లాంటి ప్రతి పథకంలోను కేంద్ర బిజెపి ప్రభుత్వ వాటా ఉంది. వైకుంటాధమాలు కేంద్ర నిధులతో కడితే..తెరాస రంగులు వేసుకుంటున్నారు. కుమ్రంభీం జిల్లాలో నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో 150కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది. తెరాస కు ,బిజెపి కి తేడా ప్రజలు గమనించాలి. ప్రధాని మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉండడంతో కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, వ్యాక్సిన్ ను తయరుచేసుకున్నాం. తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలి,’’ అంటూ సోయం బాబూరావు పిలుపునిచ్చారు.