హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మరీ ఎక్కువగా ఉంటోంది. బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో `నన్నురారా, పోరా అంటున్నారు` అని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ `నా …..`అని సంబోధించడం పట్ల రాజకీయపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి నుంచి కోలుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని, జరగబోయే ఎన్నికలలో ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినా ఆయన అభ్యంతరకర మాటలను బట్టి నైతికంగా ఓడిపోయి నట్లేనని బీజేపీ నాయకులు అన్నారు.
డివిజన్ కోటి పంపుతున్న కేసీఆర్ : సంజయ్
హైదరాబాద్ వరద సాయం కోసం ఇచ్చిన రూ. 500 కోట్లు అధికార పక్షం టీఆర్ఎస్ కార్యకర్యల జేబుల్లోకి చేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీహెఛ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పంతంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి డివిజన్ కు రూ.5 కోట్ల రూపాయలు పంపారని అన్నారు. కేసీఆర్ పాలన పట్ల జనం విసుగెత్తి పోయారని, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.నగరంలో వరదల సమయంలో ప్రధాని రాలేదని తప్పుపడుతున్న కేసీఆర్ సీఎంగా తన బాధ్యత ఎంత వరకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రజలు వరదలతో అవస్థలు పడుతుంటే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కాలేదా? అని అన్నారు.
Also Read: తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు?
ప్రజాస్వామ్యానికి, రాచరికానికి మధ్య పోరు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ప్రజాస్వా మ్యానికి, రాచరికానికి మధ్య జరుగుతున్నవని బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేందర్ యాదవ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ కు కేంద్రం చేసిందేమీ లేదన్న మంత్రి కె.తారక రామారావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ, కేంద్రం సహాయం లేకుండానే అభివృద్ధి పథకాలు కొనసాగు తున్నాయా? అని ప్రశ్నించారు. మెట్రో రైల్ , కోవిడ్ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన తెలుసుకోవాలనిఅన్నారు. హైదరాబాద్ దేశంలోనే చారిత్రాత్మక నరగమని, ఇది ఏ ఒక్కరికో సొంతం కాదని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ ను మించిన వారు లేరని ఆయన అన్నారు.
Also Read: ప్రశాంతనగరం కోసం టీఆర్ఎస్ కే ఓటు : కేసీఆర్
Also Read: ఓటుకు ప్రతికూలాలు.. అభ్యర్థుల బేజార్