ఎందరో త్యాగ ధనుల భూమి అయిన బెంగాల్ లో బీజేపీ రాణించడం కష్టంగానే కనిపిస్తోంది. హిందు ముస్లిం సిక్కు ఇసాయిలు కలిసి కట్టుగా జీవిస్తూ దేశానికి సెక్యూలర్.. సందేశాన్ని ఇస్తున్న బెంగాల్ లో హిందుత్వ రాజకీయాలు విజయవంతం కావు.. వామపక్షాల ఉనికి నేటికి బలంగానే బెంగాల్ లో ఉంది. విభజించి పాలించే రాజకీయాలు ఉద్యమ గడ్డ పై అసాధ్యం అంటున్నారు ప్రజలు.
మిత్రపక్షాలను దూరం చేసుకుంటున్న బీజేపీ
దేశంలో బిజెపి ప్రభుత్వ నిర్ణయాలు ఆ పార్టీ వెంట ఎన్డీఏ లో ఉన్న మిత్ర పక్షాలను దూరం చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను తెచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై రైతుల సుదీర్ఘ ఆందోళన, ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ లాంటి నిర్ణయాల ను బిజెపి నేతలు సైతం వ్యతిరేకిస్తున్నా పీఎం నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మలిక్ రైతుల ఆందోళన పట్ల తీవ్రంగా స్పందించారు. ఆయన బిజెపి లో కేంద్ర మంత్రి గా కూడా పని చేశారు. రైతుల ఆందోళన బీజేపీ కి ఇబ్బందులను తెచ్చి పెడుతుందని భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడవచ్చని అధికారం పోవచ్చని కూడా అన్నారు. సత్యపాల్ రైతు నాయకుడు. స్వయంగా మంచి రైతు కూడా. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులతో చర్చించాలని కూడా కేంద్రానికి సూచించారు.
Also Read : కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ
రైతులు మరణిస్తే స్పందించని ప్రభుత్వం
మూడున్నర నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతుల్లో250 మంది మరణిస్తే కనీసం కేంద్రం స్పందించలేదని కుక్క చనిపోతే సానుభూతి ఉంటుంది.. దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే సానుభూతి వ్యక్తం చేసే వారు బిజెపి లో లేక పోవడం బాధ కలిగిస్తుందని.. తన వల్ల కేంద్రానికి నష్టం అని భావిస్తే గవర్నర్ పదవిని వదిలి వేస్తానని సత్యపాల్ అన్నారు. తాను బిజెపి మంచి కోసమే రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని అంటున్నానని మేఘాలయా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా రాష్ట్రాలలో రైతుల ఆందోళనల ఫలితంగా ప్రజల నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అక్కడి సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిజెపి కి కొరకరాని కొయ్య అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వము పై ఆధిపత్యం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్..కేరళ.. తమిళనాడు.. అస్సాం.. పుదుచ్చేరి లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
Also Read : ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ