- ఎంఐఎం, టీఆర్ఎస్ మైత్రిపై బీజేపీ తీవ్ర విమర్శలు
- ప్రజస్వామ్యానికి తూట్లు పొడిచారని ఎద్దేవా
- బీజేపీకి భయపడే ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం
గ్రేటర్ మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం, టీఆర్ఎస్ లు వ్యవహరించిన తీరు విమర్శిల పాలవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేసిన టీఆర్ఎస్ ఎంఐఎంలు ప్రచారంలో భాగంగా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. రెండు పార్టీలు బద్దశత్రువుల్లా వ్యవహరించాయి. మీ మద్దతు మాకవసరం లేదంటే మాకూ అవసరంలేదని విమర్శించుకున్నాయి. అలాంటిది మేయర్ డిప్యుటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం టీఆర్ఎస్ కి మద్దతివ్వడంతో అధికార పార్టీ రెండు పదవులను సునాయాసంగా చేజిక్కించుకుంది. దీంతో వీరి మైత్రిపై బీజేపీ విరుచుకుపడుతోంది. రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
Also Read: బల్దియాపై గులాబీ జెండా రెపరెపలు
టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుపై బండి దాడి:
అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ఆధారంగా మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం సహజమన్న బండి సంజయ్, టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని చెప్పుకునే స్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్రజలన మోసగిస్తోందని టీఆర్ఎస్ పై మండిపడ్డారు. నీతివంతమైన రాజకీయాలు చేస్తే బహిరంగంగా పొత్తుపెట్టుకోవాలని చీకటి రాజకీయాల చేయడం సరికాదని అన్నారు. మేయర్, డిప్యుటీ మేయర్ అభ్యర్థులు టీఆర్ఎస్ కు చెందినవారైనా ఎంఐఎం కనుసన్నల్లో మెలగాల్సిందేనని సంజయ్ ఎద్దేవా చేశారు.
నేను ముందే చెప్పానన్న విజయశాంతి:
టీఆర్ఎస్ ఎంఐఎం లు సియామీ కవలలని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముందే చెప్పానని ఇపుడు తను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతివ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్లు అందరికీ తెలుసని విజయశాంతి వ్యాఖ్యనించారు.
Also Read: గ్రేటర్ టీఆర్ఎస్ లో అసమ్మతి