Monday, December 23, 2024

దేశవ్యాప్తంగా బిజెపి సొంత సర్వే! తెలంగాణా ఫలితాలు ముందే తేల్చేశారు!

వోలేటి దివాకర్‌

తెలంగాణా పన్నికల ఫలితాలను బిజెపి సర్వే బృందం ముందే తేల్చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణా అసెంబ్లీ పన్నికల్లో పార్టీ ఓడిపోతుందని సర్వే టీమ్‌ ముందే సంకేతాలు ఇచ్చింది. రానున్న పార్లమెంటు పన్నికల్లో మాత్రం మెరుగైన ఫలితాలను సాధిస్తుందని బిజెపి సర్వే టీమ్‌ నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. రానున్న సార్వత్రిక పన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 542 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజల నాడిని పట్టుకునేందుకు బిజెపి ఐటి విభాగం ప్రత్యేకంగా  జోనల్‌ స్థాయిలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని  రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి,  అనంతపురంలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, 32 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో యువతను నియమించారు. వీరు ప్రతీరోజూ కేంద్రప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఫోన్లు చేసి, పథకాలు అందుతున్నదీ…లేనిదీ తెలుసుకోవడంతో పాటు, ఏపార్టీ వైపు వారు మొగ్గు చూపుతున్నారన్న విషయాలను తెలుసుకుని, ప్రజల మూడ్‌ను బిజెపి అధిష్టానానికి, స్థానిక నేతలకు తెలియజేస్తుంది. ఈ సర్వే నివేదికల ఆధారంగానే బిజెపి పొత్తులు, అభ్యర్థుల పంపిక వంటి కీలక అంశాలను ఖరారు చేస్తుంది.

Also read: సీటు కోసం పోటీ….పేచీ తప్పదా?!

నేను పోటీలోనే ఉన్నా…సోము

రానున్న పన్నికల్లో తను ఎన్నికల బరిలో నిలవనున్నట్లు బిజెపి ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడిరచారు. రాజమహేంద్రవరం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. అయితే పార్లమెంటుకా…అసెంబ్లీకా అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పంపి స్థానాల్లో    పార్టీ శ్రేణులను పన్నికలకు సమాయాత్తం చేసేందుకు 32 మందితో సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ నాటికి పన్నికల ప్రక్రియ కొలిక్కి వస్తుందన్నారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సోము వీర్రాజు హావభావాలు, మాటలను బట్టి ఏపీలో వచ్చే పన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ప్రతీ గ్రామంలో కేంద్ర పథకాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు.  కేంద్ర పథకాలను ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటున్నారన్నారు. మోడీ పథకాలతోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది శూన్యమని విమర్శించారు. మోడీ అమలు చేస్తున్న పథకాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వ పథకాలు దిగదిడుపునేనన్నారు. ఏపీలో కోటి మందికి బిజెపి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోందని, రైతులకు 15 రకాల పథకాలను అమలు చేస్తోందని వివరించారు. బిజెపి అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్నే వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఇంటింటికీ వైద్యం పేరిట అమలుచేస్తోందన్నారు. కేంద్ర పథకాలు పేరు మార్చి, తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. రాజధాని లేకుండా చేసి, ఆర్భాటాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తోందన్నారు.

ప్రధాని మోడీకి సరితూగే నాయకుడు దేశంలోనే లేరని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆయనను విమర్శించే స్థాయి కూడా ఎవరికీ లేదన్నారు.  మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు, ప్రజల్లో దేశభక్తిని నిర్మాణం చేస్తున్నారన్నారు. లక్షద్వీప్‌,మాల్దీవుల వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు.

Also read: జై తెలుగుతల్లీ!  గోదావరి తీరంలో తెలుగు వెలిగింది!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles